Tirupathi Rao
Japan Telugu Movie Review & Rating: కార్తీ సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లో గొప్ప అంచనాలు ఉంటాయి. తమిళ్ కంటే కూడా తెలుగు ప్రేక్షకుల్లోనే కార్తీ సినిమాలకు ఆదరణ ఎక్కువ. మరి.. కార్తీ జపాన్ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేయండి.
Japan Telugu Movie Review & Rating: కార్తీ సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లో గొప్ప అంచనాలు ఉంటాయి. తమిళ్ కంటే కూడా తెలుగు ప్రేక్షకుల్లోనే కార్తీ సినిమాలకు ఆదరణ ఎక్కువ. మరి.. కార్తీ జపాన్ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేయండి.
Tirupathi Rao
ప్రస్తుతం ఉన్న హీరోలలో అన్నీ వర్గాల ప్రేక్షుకులకి నచ్చే స్టార్ కార్తీ. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ వర్సటైల్ యాక్టర్ ఇప్పుడు జపాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ప్రమోషనల్ వీడియోస్ తోనే.. బీభత్సమైన బజ్ సొంతం చేసుకున్న జపాన్ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
జపాన్ ( కార్తీ) ఓ పెద్ద క్రిమినల్. ఎక్కువగా బంగారం దోచుకుంటూ ఉంటాడు. అతని బంగారం అంటే అంత ఇష్టం. దీనికి తోడు.. తెరపై తనని తాను హీరోగా చూసుకోవాలి అనే కోరిక ఉంటుంది. ఇందుకోసం తనకి ఇష్టమైన సంజుని బెదిరించి.. తాను హీరోగా, సంజు హీరోయిన్ గా ఓ సినిమాని నిర్మిస్తాడు. ఒక్క సినిమాతోనే జపాన్ పెద్ద స్టార్ అయిపోతాడు. కానీ.., నగరంలో జరిగిన ఓ భారీ దొంగతనంలో చిక్కుకుంటాడు జపాన్. అప్పటికే అతని కోసం న్నీ రాష్ట్రాల పోలీసులు గాలిస్తూ ఉంటారు. . కానీ జపాన్‌కు అనుకూలంగా ఒక్క సాక్ష్యం కూడా దొరకదు. దీంతో.. అతని ఆటలు సాగుతూ ఉంటాయి. అయితే.., రెండు వందల కోట్ల రాబరీ కేసులో జపాన్ ఎలా ఇరుక్కున్నాడు? ఆ భారీ దొంగతనం జపాన్ జీవితాన్ని ఎలా మార్చింది? అసలు జపాన్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అతను దొంగతనాలు చేయడానికి కారణం ఏమిటి అన్నది మిగిలిన కథ.
సినిమా బాగుండాలంటే అద్భుతమైన కథ ఉండాలన్న రూల్ ఇప్పుడు ఏమి లేదు. హీరోకి మంచి క్యారెక్టరైజేషన్ ఉండి, అంతకుమించిన ఎమోషన్స్ పండిస్తే చాలు.. సినిమా సూపర్ హిట్. జపాన్ మూవీ టీజర్, ట్రైలర్ చూసి ప్రేక్షకులు కూడా ముందుగా ఈ మూవీ హిట్ అవ్వడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు. పైగా.., అక్కడ హీరోగా ఉన్నది కార్తీ. అతని లుక్, డైలాగ్ డెలివరీ అంచనాలను ఇంకా పెంచేశాయి. కానీ.., ఇన్ని అంచనాలతో జపాన్ మూవీకి వెళ్తే మీకు నిరాశ తప్పదు. సినిమా మొదలైన 20 నిమిషాల వరకు అసలు మనం చూస్తున్నది ఏమి సినిమా, ముందు సీన్ కి, వెనుక సీన్ కి లింక్ ఏంటి అనే అనుమానం కలగకమానదు. ఇలాంటి సమయంలో ఎంట్రీ ఇచ్చే జపాన్ క్యారెక్టర్ కొంతమేర ఆకట్టుకుంటుంది. ఇక సినిమా ట్రాక్ ఎక్కుతుంది అనుకునే తరుణంలో దర్శకుడు చేతులు ఎత్తేశాడు. ఒక్క ఎమోషన్ కూడా పండకుండా.. ఓ ప్లైన్ నేరేషన్ అలా సాగిపోతూ ఫస్ట్ హాఫ్ పూర్తి అయిపోతుంది.
జపాన్ ఫస్ట్ ఆఫ్ చూశాక.. సెకండ్ ఆఫ్ నుండి ప్రేక్షకుడు పెద్దగా ఆశించేది ఏమి ఉండదు. అలాంటి స్థితిలో కూడా ఈ చిత్ర దర్శకుడు ఇంకా ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతాడు. కార్తీకి వచ్చే వ్యాధి, చుట్టూ ఉన్న రిలేషన్స్ ని అతను అర్ధం చేసుకునే విధానం, అన్నీ మంచి సన్నివేశాలే అయినా.. దర్శకుడు వాటిని తెరకెక్కించిన విధానం మాత్రం చాలా సాధారణంగా ఉండటమే ఇక్కడ సమస్య. కాకుండా.. ద్వితీయార్ధంలో వచ్చే చాలా డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. తల్లి సెంటిమెంట్ వర్కౌట్ కాక, లవ్ ట్రాక్ ఆకట్టుకోక.. సన్నివేశాలు ఎందుకు వస్తున్నాయో, ఎందుకు పోతున్నాయి అర్ధం కాక.. జపాన్ మూవీ ఆడియన్స్ ని ఇబ్బంది పెడుతూ ముగుస్తుంది.
జపాన్ మూవీలో గొప్పగా చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందా అంటే అది.. కార్తీ నటనే. జపాన్ క్యారెక్టర్ కోసం కార్తీ పూర్తిగా తనని తాను మార్చుకున్నాడు. ఈ మార్పు ఏదో గెటప్, డైలాగ్ డెలివరీకి మాత్రమే పరిమితం కాదు. అతని, నడక, నడత, బాడీ లాంగ్వేజ్ అన్నీ మారిపోయాయి. ఓ నటుడు పాత్రలోకి పరకాయం ప్రవేశం చేయడం అనే మాటకి ఇదే సరైన ఉదాహరణ. కాకుంటే.. కథా, కథనంలో విషయం లేక కార్తీ కష్టం వృధా అయిపోయింది. ఇక.. ఇందులో కార్తీ తరువాత సునీల్ కి మంచి పాత్ర దొరికింది. ఆ మేరకు సునీల్ కూడా నటనతో మెప్పించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక హీరోయిన్ అను ఇమాన్యుయేల్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. మిగతా నటులు కూడా కొంతమేర పరవాలేదు అనిపించారు.
ఈ చిత్ర దర్శకుడు రాజు మురుగన్ కోలీవుడ్ లో మంచి డైలాగ్ రైటర్. ఆ తరువాతే దర్శకుడిగా మారాడు. ఇప్పటికే రాజు మురుగన్ దర్శకుడిగా కొన్ని మంచి చిత్రాలను తెరకెక్కించినా కార్తిలాంటి ఓ స్టార్ హీరోని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా తడబడ్డాడు. ఈ సినిమాలో కెమెరా పనితనం మెప్పిస్తుంది. పాటలు మాత్రం ప్రేక్షకుల్లో అంత ప్రభావం చూపలేదనే చెప్పాలి. మీకు ఈ సినిమా డ్యూరేషన్ కూడా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కార్తీ సినిమా మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా కూడా అతనికి తగిన సపోర్ట్ దొరకలేదనే చెప్పాలి. నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి.
చివరి మాట: జపాన్.. కార్తీ సక్సెస్ ట్రాక్ తప్పాడు..
రేటింగ్: 2/5