iDreamPost
android-app
ios-app

Jewel Thief Movie Review: జ్యూవెల్ థీఫ్ – మూవీ రివ్యూ

  • Published Nov 09, 2024 | 1:33 PM Updated Updated Nov 09, 2024 | 1:33 PM

Jewel Thief Movie Review And Rating In Telugu: తెలుగు ప్రేక్షకులకు సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే మక్కువ ఎక్కువ అనే చెప్పాలి. అయితే ఈ తరహా జానర్ లో చాలా తక్కువ సినిమాలు మాత్రమే వస్తూ ఉంటాయి. అయితే జ్యూవెల్ థీఫ్ అంటూ ఇప్పుడు ఒక కొత్త సినిమా విడుదల అయ్యింది. మరి.. ఆ చిత్రం ఎలా ఉందో తెలియాలి అంటే ఈ రివ్యూ చూసేయండి.

Jewel Thief Movie Review And Rating In Telugu: తెలుగు ప్రేక్షకులకు సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే మక్కువ ఎక్కువ అనే చెప్పాలి. అయితే ఈ తరహా జానర్ లో చాలా తక్కువ సినిమాలు మాత్రమే వస్తూ ఉంటాయి. అయితే జ్యూవెల్ థీఫ్ అంటూ ఇప్పుడు ఒక కొత్త సినిమా విడుదల అయ్యింది. మరి.. ఆ చిత్రం ఎలా ఉందో తెలియాలి అంటే ఈ రివ్యూ చూసేయండి.

  • Published Nov 09, 2024 | 1:33 PMUpdated Nov 09, 2024 | 1:33 PM
Jewel Thief Movie Review: జ్యూవెల్ థీఫ్ – మూవీ రివ్యూ

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్ అంటే మూవీ ల‌వ‌ర్స్‌ కు ఎంతో ఇష్టం. స‌రైన కంటెంట్‌తో దిగితే వాటిని ప్రేక్ష‌కులు సూప‌ర్ హిట్ చేస్తారు. అదే కోవలో వ‌చ్చిన చిత్రం “జ్యూవెల్ థీఫ్ – Beware of Burglar”. తాజాగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. పీఎస్ నారాయణ దర్శకత్వం వహించగా, మల్లెల ప్రభాకర్ నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. ఎంఎం శ్రీలేఖ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే ఉందా? ఈ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

కథ:
సిన్సియర్ ట్రావెల్స్ ఓనర్ కృష్ణ (కృష్ణసాయి) వ‌జ్రాలు, బంగారం న‌గ‌లు దొంగిలిస్తుంటాడు. శివారెడ్డితో క‌లిసి దొంత‌నాలు చేస్తూ వ‌చ్చిన డ‌బ్బు అనాథ పిల్ల‌ల‌కు పంచిపెడ‌తాడు. అనాథ ఆశ్ర‌మంలో ఉండే చలాకి అనే అమ్మాయి (మీనాక్షీ జైస్వాల్) కృష్ణసాయి మంచి త‌నాన్ని చూసి ప్రేమిస్తుంది. సీన్ క‌ట్ చేస్తే.. నేహ (నేహా దేశ్ పాండే) నెక్లెస్ కూడా దొంగిలిస్తాడు. ప‌ట్టుబ‌డి జైలుకు వెళ్లి వ‌స్తాడు. కృష్ణ గురించి అస‌లు విష‌యం తెలుసుకుని ప్రేమిస్తుంది. ఇదే క్ర‌మంలో ఒక కండీష‌న్ పెడుతుంది. మోసం చేయకుండా, జూదం ఆడకుండా 6 నెలల్లో 15 లక్షలు సంపాదించి ఫ్రూవ్ చేసుకోవాల‌ని చాలెంజ్ పెడుతుంది. ఈ క్ర‌మంలో ధ‌నిక కుటుంబానికి చెందిన అనారోగ్యంగా ఉన్న వ్య‌క్తికి ప‌నులు చేస్తూ, అత‌డిని బాగు చేస్తాడు. కానీ, అనారోగ్యంగా ఉన్న వ్య‌క్తిని చంపిన‌ట్టు హ‌త్య కేసులో ఇరుక్కుంటాడు. న‌మ్మించి భారీ దెబ్బ కొడ‌తారు. ఇంత‌కీ కృష్ణను మోసం చేసింది ఎవ‌రు? ఊహించ‌ని చిక్కుల్లో ఎలా ఇరుక్కుంటాడు? హ‌త్య కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌తాడా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన పీఎస్ నారాయణ ఈ త‌రం ప్రేక్షకులకు న‌చ్చే సినిమాను అందించారని చెప్ప‌వ‌చ్చు. త‌ను రాసుకున్న‌ కథను ఆక‌ట్టుకునే రీతిలో తెరపై ఆవిష్కరించారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం, ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. బ్యాంకాక్‌ లో చిత్రీకరించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొత్తం మీద అన్ని విభాగాల్లో సరైన నాణ్యత కనిపిస్తోంది.

నటీనటులు:
హీరో కృష్ణసాయి తన పాత్రలో మంచి నటన కనబరిచారు. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారని చెప్పవచ్చు. ఆయన డ్యాన్స్, మేనరిజమ్స్, హెయిర్ స్టైల్ ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాల్లో సూపర్ స్టార్ కృష్ణ పోలికలతో కనబడతారు. ఫైటింగ్ సీన్లలో ఇరగదీశాడు. ఇక హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ గ్లామ‌ర్ ఆండ్ ఫ‌ర్మార్మెన్స్‌తో ఆకట్టుకుంది. సీనియర్ నటీనటులు ప్రేమ, అజయ్ క‌థ‌కు త‌గిన‌ట్టుగా త‌మ యాక్టింగ్ ప్ర‌ద‌ర్శ‌న చూపించారు. ఇక‌ “30 ఇయర్స్” పృథ్వి, శివారెడ్డి టైమింగ్‌ తో న‌వ్విస్తుంటారు. శ్రావణి, శ్వేతా రెడ్డి తమ పాత్రల్లో చక్కగా న‌టించారు.

టెక్నికల్ పనితీరు:
ఎం.ఎం. శ్రీలేఖ అందించిన సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. బ్యాక్ గ్రాండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రాఫర్ అడుసుమిల్లి విజయ్ కుమార్ విజువల్స్ అందంగా చూపించారు, ఎడిటర్ జేపీ పనితీరు సంతృప్తికరంగా ఉంది. ఫైట మాస్టర్ మార్షల్ రమణ రూపొందించిన స్టంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

తీర్పు:
జ్యూవెల్ థీఫ్ మూవీ పూర్తి స్థాయి సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet