కేరాఫ్ సూర్య రివ్యూ

  • Published - 09:49 PM, Fri - 24 November 17
కేరాఫ్ సూర్య రివ్యూ

హీరో సందీప్ కిషన్ కి ఓ అడ్వాంటేజ్ ఉంది. అదే తమిళం కూడా రావడం. అందుకే కథలు సెట్ అయితే రెండు భాషల్లోనూ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అలా తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన చిత్రం కేరాఫ్ సూర్య. తమిళంలో నాపేరు శివ వంటి సూపర్ హిట్స్ అందించిన సుశీంద్రన్ దర్శకుడు కావడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ నెలకొంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం.

కథ :
సూర్య (సందీప్ కిషన్) కేటరింగ్ కంపెనీలో ఉద్యోగి. నాన్న అనారోగ్యంతో చనిపోతారు. చెల్లి మెడిసిన్ చదువుతుంది. అమ్మతో కలిసి హ్యాపీగా గడిపేస్తుంటాడు. అతనికి ప్రాణ స్నేహితుడు మహేష్ (విక్రాంత్). సూర్య చెల్లెలు మహేష్ ప్రేమించుకుంటారు. కానీ ఈ విషయం సూర్యకు తెలియదు.

మరో వైపు సుపారీలు తీసుకొని మర్డర్స్ చేస్తుంటాడు సాంబశివుడు (హరీష్ ఉత్తమన్). అలా సాంబిశివుడికి ఓ భారీ సూపారీ వర్క్ వస్తుంది. అందులో భాగంగా సూర్య మీద అటాక్ జరుగుతుంది. కానీ అది తన మీద కాదు తన ఫ్రెండ్ మీద జరిగిందని తెలుసుకుంటాడు. కానీ అది తన ఫ్రెండ్ మీద కూడా కాదు తన చెల్లెల్ని చంపడం కోసం అని తెలుసుకొని షాక్ అవుతాడు. ఇంతకూ… సాంబశివుడికి సూర్య చెల్లెల్ని ఎందుకు చంపాల్సి వస్తుంది. ఈ సూపారీ ఎవరిచ్చారు. తన ఫ్యామిలీని తన స్నేహితుడిని కాపాడుకున్నాడా లేదా అన్నదే అసలు కథ.

సమీక్ష
ఈ సినిమాకు ప్రధాన బలం సెకండ్ హాఫ్. ఫస్టాఫ్ లో పాత్రల పరిచయాలు… క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ మెంట్. హీరో చెల్లెలు, స్నేహితుడి లవ్… సమస్యల్లో ఇరుక్కోవడం వాంటి సన్నివేశాలతో సాగుతుంది. మెయిన్ గా స్నేహితుడి చుట్టూ కథ తిరుగుతుంది. తన స్నేహితుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసుకున్న తర్వాతి నుంచి కాపాడేందుకు చేసే ప్రయత్నాలతో సినిమా స్పీడ్ గా పరుగెత్తుతుంది.

ఇంటర్వెల్ ట్విస్ట్ తో ద్వితియార్థంపై క్యూరియాసిటీని రెట్టింపు చేస్తుంది. సందీప్ కిషన్ కెరీర్లో మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ డిజైన్ చేయబడిన చిత్రమిది. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా మధ్య తరగతి యువకుడిగా నటించాడు. ఎమోషనల్ టచ్ ఉన్న పాత్రలో సందీప్ చాలా బాగా చేశాడు. తన కెరీర్లో చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఇది. ఇక తన స్నేహితుడిగా విక్రాంత్ నటన బాగుంది. దూకుడు స్వభావమున్న పాత్రలో కనిపించాడు. హీరోయిన్ మెహ్రీన్ చూడటానికి బాగుంది. అయితే పెద్దగా సీన్స్ లేవు. విలన్ గా నటిచిన హరీష్ ఉత్తమన్ చాలా బాగాచేశాడు. అతని విలనిజం బాగుంటుంది. గెటప్ లుక్ కూడా బాగా సెట్ అయ్యింది.

దర్శకుడు సుశీంద్రన్ సస్పెన్స్ ను బాగా మెయింటైన్ చేశాడు. రెండో భాగం ప్రీ క్లైమాక్స్ వరకు సస్పెన్స్స మెయింటైన్ చేస్తూ… ఆడియెన్స్ లో క్యూరియాసిటీని పెంచుతూ వెళ్లాడు. ఫ్రెండ్ షిప్ ను… బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. స్క్రీన్ ప్లే పరంగానూ సక్సెస్ ఆయ్యాడు. సిస్టర్ సీన్స్ కూడా బాగుంటాయి. ప్రథమార్థంలో అక్కడక్కడ బోర్ కొట్టినా… సెకండాఫ్ లో వాటికి తగ్గ సీన్స్ తో ఆడియెన్స్ ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ సారి ఉత్కంఠ కంటే కూడా… ప్లెయిన్ స్లో నరేషన్ ఎంచుకున్నాడు దర్శకుడు. ఇమ్మాన్ పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా హెల్ప్ అయ్యాయి. లక్ష్మణ్ కుమార్ సినిమాటోగ్రఫీ సహజంగా ఉంది. చక్రి చిగురుపాటి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా…
సుశీంద్రన్ ది విభిన్నమైన శైలి. తన సినిమాకు స్క్రీన్ ప్లే నే బలం. కేరాఫ్ సూర్య లోనూ.. తనదైన స్క్రీన్ ప్లే కొన్ని ఇంట్రస్టింగ్ సన్నివేశాలతో… ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయగలిగాడు. నా పేరు సూర్య అంత ఎమోషన్స్ క్యారీ అవ్వకపోయినా… ద్వితియార్థంలో వచ్చే సన్నివేశాలతో… థ్రిల్లర్ చిత్రాల్నిఇష్టపడే ప్రేక్షకులకు ఈ వారం కేరాఫ్ సూర్య కేరాఫ్ అయ్యే అవకాశం ఉంది.

Show comments