iDreamPost
android-app
ios-app

Sundeep Kishan: సందీప్ కిషన్ హోటల్ పై మరక మంచిదే! మంచి విషయం తెలిసింది!

  • Published Jul 26, 2024 | 4:42 PM Updated Updated Jul 26, 2024 | 4:42 PM

సందీప్ కిషన్ వివాహ భోజనంబు రెస్టారెంట్ లో.. ఫుడ్ సేఫ్టీ రూల్స్ సరిగా పాటించట్లేదని.. ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సందీప్ కిషన్ ఈ విషయంపై తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చాడు. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

సందీప్ కిషన్ వివాహ భోజనంబు రెస్టారెంట్ లో.. ఫుడ్ సేఫ్టీ రూల్స్ సరిగా పాటించట్లేదని.. ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సందీప్ కిషన్ ఈ విషయంపై తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చాడు. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Jul 26, 2024 | 4:42 PMUpdated Jul 26, 2024 | 4:42 PM
Sundeep Kishan: సందీప్ కిషన్ హోటల్ పై మరక మంచిదే! మంచి విషయం తెలిసింది!

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ఓ వైపు సినిమాలలో నటిస్తూనే.. మరోవైపు ఎన్నో బిజినెస్ లను కూడా రన్ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో సందీప్ కిషన్ కూడా ఓ రెస్టారెంట్ ను నడుపుతున్న సంగతి తెలిసిందే. వివాహ భోజనంబు పేరుతో హైదరాబాద్ లో సందీప్ కిషన్ కు సంబంధించిన రెస్టారెంట్ లో ఏడు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీలలో భాగంగా.. వివాహభోజనంబు బ్రాంచ్ లో కూడా తనిఖీలు నిర్వహించారు. అయితే ఆ తనిఖీలలో.. రెస్టారెంట్ లో సేఫ్టీ రూల్స్ పాటించట్లేదని.. అధికారులు నోటీసులు జారీ చేసినట్లు టాక్ వినిపించింది. ఆల్రెడీ సందీప్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. కానీ తాజాగా రాయన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మరోసారి సందీప్ కు ఈ ప్రశ్న ఎదురైంది. దీనితో మరోసారి సందీప్ ఈ విషయంపై అందరికి క్లారిటీ ఇచ్చాడు.

ఆ ఇంటర్వ్యూ లో తనకు ఎదురైన ప్రశ్నకు సందీప్ ఇలా సమాధానం ఇచ్చారు.. అన్ని రెస్టారెంట్స్ లో జరిగినట్టే తన రెస్టారెంట్ లో కూడా నార్మల్ గానే తనిఖీ జరిగిందని.. తమకు ఎక్స్పెయర్ అయిపోయిన బియ్యంతో మోసం చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. అలాగే తమకు ఏడు బ్రాంచ్ లు ఉన్నాయని.. రోజు ఒక్కో బ్రాంచ్ నుంచి ఫ్రీ గా 50 మందికి ఫుడ్ పంపిస్తున్నట్లుగా చెప్పారు. అంటే ప్రతి రోజు దాదాపు 350 మందికి ఫ్రీగా ఫుడ్ అందిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో దానికోసం సుమారు నెలకు రూ.4 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇన్ని లక్షల రూపాయలను డొనేట్ చేస్తూ.. కేవలం ఓ రైస్ బ్యాగ్ విషయంలో ఎందుకు అలా చేస్తాం అంటూ ప్రశ్నించారు. అలాగే రెస్టారెంట్ పై వచ్చినవన్నీ ర్యూమర్స్ అని మరోసారి క్లియర్ గా క్లారిటీ ఇచ్చేశారు. ఏదేమైనా దీని ద్వారా మంచి విషయమే బయటపడింది. అతను సినిమాలలోనే కాకుండా.. తన బిజినెస్ విషయంలో కూడా ఎలాంటి శ్రద్ద వహిస్తాడు అనేది అర్ధమౌతుంది.

ఇక అంతే కాకుండా.. నార్మల్ డే కంటే కూడా.. సేఫ్టీ చెక్ అయినా తర్వాత రోజు.. కస్టమర్స్ ఎక్కువ వచ్చారని.. తనపై ఎన్ని ర్యూమర్స్ వచ్చినా కానీ.. రెస్టారెంట్ కు మాత్రం ఎలాంటి బ్యాడ్ ఇమేజ్ రాలేదని చెప్పుకొచ్చారు సందీప్ కిషన్. దీని ద్వారా ఎంతో మందికి ఉపాధి కలిగించినట్లు.. ఎంతో మంది కడుపు నింపుతున్నట్లు తెలియజేశారు. హోటల్ పై వచ్చిన రూమర్ కారణంగా.. సందీప్ గురించి మరిన్ని మంచి విషయాలు తెలిశాయని భావిస్తున్నారు అభిమానులు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/