iDreamPost
android-app
ios-app

Sundeep Kishan: సందీప్ కిషన్ గొప్ప మనసు! సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చూసి..

  • Published Sep 02, 2024 | 11:09 AM Updated Updated Sep 02, 2024 | 11:09 AM

Sundeep Kishan helped a family: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మరోసారి తన మంచి మనసునుచాటుకున్నాడు. సోషల్ మీడియాలో వచ్చిన రిక్వెస్ట్ కు స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Sundeep Kishan helped a family: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మరోసారి తన మంచి మనసునుచాటుకున్నాడు. సోషల్ మీడియాలో వచ్చిన రిక్వెస్ట్ కు స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Sep 02, 2024 | 11:09 AMUpdated Sep 02, 2024 | 11:09 AM
Sundeep Kishan: సందీప్ కిషన్ గొప్ప మనసు! సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చూసి..

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఓ వ్యక్తి తల్లికి హాస్పిటల్ ఖర్చుల కోసం తన వంతు సాయం అందించాడు. యాక్సిడెంట్ కారణంగా ఆమెకు మెదడులో బ్లీడింగ్ అవుతుందని, రోజుకు దాదాపు రూ. 60 వేల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని, మీ సాయం కావాలంటూ.. ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో చెలించిపోయిన సందీప్ కిషన్ వెంటనే రూ. 50 వేలు వారికి సాయం చేశాడు. ఎవరికి వీలైనంత వారు సాయం చేయాలని కోరాడు.

సందీప్ కిషన్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నాడు. యాక్సిడెంట్ కారణంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఓ మహిళకు వైద్య ఖర్చుల కోసం రూ. 50 వేలు సాయం చేశాడు. సోషల్ మీడియాలో వచ్చిన రిక్వెస్ట్ మేరకు అతడు స్పందించాడు. ఈ విషయం తెలిసిన సందీప్ ఫ్యాన్స్ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాను సాయం చేశానని, మీరు కూడా ఎంతో కొంత చేయాలని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. కాగా.. ఇప్పటికే ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తున్నాడు ఈ యంగ్ హీరో. తన రెస్టారెంట్ల నుంచి రోజుకు 350 మంది పేదలకు ఆహారం వెళ్తుందని రాయన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

కాగా.. ముఖ్యంగా ఆశ్రమాలు, రోడు సైడ్ ఉండే పేదలకు ఈ ఆహారాన్ని పంపిణి చేస్తున్నట్లు, దానికి నెలకు దాదాపు రూ. 4 లక్షలకు పైగానే ఖర్చు అవుతుందని సందీప్ కిషన్ తెలిపాడు. భవిష్యత్ లో హైదరాబాద్ లో తక్కువ ధరకే క్యాంటిన్లను ఏర్పాటు చేసి, పేదలకు ఆహారాన్ని అందించాలని చూస్తున్నట్లుగా ఆ సందర్భంగా పేర్కొన్నాడు. ఇక ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టిన ధనుష్ రాయన్ మూవీలో కీలకపాత్ర పోషించి అదరగొట్టాడు సందీప్ కిషన్. మరి సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చూసి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న సందీప్ కిషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss