iDreamPost
android-app
ios-app

Raayan Twitter Review: ధనుష్‌ రాయన్‌ ట్విట్టర్‌ రివ్యూ.. ఎలా ఉందంటే

  • Published Jul 26, 2024 | 8:20 AMUpdated Jul 26, 2024 | 8:20 AM

Raayan Twitter Review: ధనుష్‌ హీరోగా నటించిన రాయన్‌ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్విట్టర్‌లో ధనుష్‌ ఫ్యాన్స్‌ సందడి చేస్తున్నారు. ఆ వివరాలు..

Raayan Twitter Review: ధనుష్‌ హీరోగా నటించిన రాయన్‌ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్విట్టర్‌లో ధనుష్‌ ఫ్యాన్స్‌ సందడి చేస్తున్నారు. ఆ వివరాలు..

  • Published Jul 26, 2024 | 8:20 AMUpdated Jul 26, 2024 | 8:20 AM
Raayan Twitter Review: ధనుష్‌ రాయన్‌ ట్విట్టర్‌ రివ్యూ.. ఎలా ఉందంటే

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ధనుష్‌.. కేవలం సౌత్‌లోనే కాక బాలీవుడ్‌, హాలీవుడ్‌ వరకు క్రేజ్‌, గుర్తింపు సంపాదించుకున్నాడు. మరి ఆయన నటించిన సినిమా అంటే.. దక్షిణాదితో పాటు.. బాలీవుడ్‌లో కూడా ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో ధనుష్‌ హీరోగా.. టాలీవుడ్‌ టాలెంటెడ్‌ హీరో సందీప్‌ కిషన్‌ ప్రధాన పాత్రలో నటించిన రాయన్‌ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమాకు ధనుషే డైరెక్టర్‌. తనే స్వయంగా రాసి, నటించిన సినిమా రాయన్‌. మరి ఈ సినిమా ద్వారా ధనుష్‌.. డైరెక్టర్‌గా విజయం సాధించాడా లేదా.. అంటే సినిమా చూసిన జనాలు.. ట్విట్టర్‌ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

రాయన్ రిలీజ్ సందర్భంగా థియేటర్స్‌ వద్ద ధనుష్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇక ట్విట్టర్ మొత్తం రాయన్ సందడే కనిపిస్తోంది. ధనుష్ ఫ్యాన్స్ అయితే రాయన్ సినిమా భారీ విజయం సాధిస్తుందని.. బ్లాక్‌ బాస్టర్‌ హిట్టు పక్కా అని కామెంట్స్‌ చేస్తున్నారు. రాయన్‌ బాక్సాఫీస్‌ దగ్గర ఊచకోత కోస్తాడని నమ్ముతున్నారు. ఇక బుక్ మై షోలో రాయన్‌ బుకింగ్స్‌ చూసుకుంటే.. హిట్టు పక్కా అని అర్థం అవుతోంది. బుక్‌మై షోలో టికెట్‌ బుకింగ్స్‌ భారీ స్థాయిలో ఉన్నాయి. గంటలోపే లక్షల టికెట్లు తెగుతున్నాయని అభిమానులు సంబరపడుతున్నారు. అయితే ఇంకా రాయన్ షోలు పడలేదని, అంతా షో కోసం వెయిట్ చేస్తున్నామని ట్వీట్లు వేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఓ ట్విట్టర్‌ ఖాతాలో మాత్రం.. రాయన్‌ ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, సెకండ్ హాఫ్ మరింత అద్భుతంగా ఉందని, టైటిల్ కార్డ్ సూపర్ అని, ధనుష్ ఎంట్రీ పిచ్చ మాస్‌గా ఉందంటూ ట్వీట్‌ చేశారు. ఇక ఇంటర్వెల్, క్లైమాక్స్ బ్యాంగ్ అదిరిపోయిందని, ధనుష్ నటన అద్భుతమంటూ జనరలైజ్‌ ట్వీట్ పెట్టేశాడు. అయితే ఇది ఫేక్‌ అంటున్నారు. ఇంకా షోలే పడనప్పుడు ఫస్టాఫ్‌, సెకండాఫ్‌ బాగుంది అని ట్వీట్‌ చేయడం ఏంటి.. ఇది ఫేక్‌ అకౌంట్‌ అని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ధనుష్‌ విషయానికి వస్తే.. రాయన్‌ తర్వాత ఆయన టాలీవుడ్‌ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అక్కినేని నాగార్జున, రష్మిక మందన్నా కీలకపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి