Raj Mohan Reddy
Bubblegum Movie (2023) Review & Rating in Telugu: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా ‘బబుల్ గమ్’ అనే సినిమా తెరకెక్కింది. ఈ మూవీ డిసెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా?
Bubblegum Movie (2023) Review & Rating in Telugu: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా ‘బబుల్ గమ్’ అనే సినిమా తెరకెక్కింది. ఈ మూవీ డిసెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా?
Raj Mohan Reddy
నటన నేర్పి..ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలని అందించిన చరిత్ర కనకాల ఫ్యామిలీది. ఇప్పుడు ఆ కుటుంబం నుండి రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం బబుల్ గమ్. మరి.. కొడుకుని హీరోగా సెటిల్ చేయాలన్న సుమ, రాజీవ్ కనకాల ఆశలు ఫలించాయా? బబుల్ గమ్ మూవీ ఫలితం ఎలా ఉంది? ఇలాంటి విషయాలన్నీ రివ్యూ ద్వారా తెలుసుకుందాం
ఆది ( రోషన్ కనకాల) డీజే అవ్వాలని ప్రయత్నాలు చేస్తుండే ఓ పక్కా హైదరాబాది మధ్యతరగతి కుర్రాడు. ఇతని జీవితంలోకి అనుకోకుండా పెద్దింటి అమ్మాయి జాను ( మానస చౌదరి) వస్తుంది. ప్రేమ, పెళ్లి వంటి ఎమోషన్స్ కి దూరంగా, అబ్బాయిల్ని కేవలం ఒక టాయ్ గా చూసే తత్వం జానుది. ముందుగా ఆదిని కూడా అలాగే ట్రీట్ చేస్తుంది జాను. కానీ..,
తనకి తెలియకుండానే పూర్తిగా ఆది ప్రేమలో పడిపోతుంది. మరి.. రెండు వేరువేరు నేపథ్యాలు కలిగిన వీరి ప్రేమ చివరికి ఎలాంటి మలుపు తీసుకుంది? వీరిద్దరూ చివరికి కలిసిపోయారా? లేదా? అన్నదే మిగిలిన కథ.
ఒక అబ్బాయి, ఒక అమ్మాయి.. వారిద్దరి మధ్య లవ్. ఆ ప్రేమ చుట్టూ ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్. క్లైమాక్స్ తీసేసి చూస్తే.. బబుల్ గమ్ కూడా ఇలాంటి ఓ సాదాసీద కథ. ఇందుకు తగ్గట్టే ఫస్ట్ హాఫ్ లో ఎలాంటి ఎంగేజింగ్ మూమెంట్స్ కనిపించవు. అతి సాధారణంగా సాగిపోయే ఫ్రెండ్స్ కామెడీ ట్రాక్. లస్ట్ తప్ప ఎలాంటి ఎమోషన్ లేకుండా సాగిపోయే లవ్ ట్రాక్.. అక్కడక్కడ హద్దులు మీరి వినిపించే అనవసరపు బూతు డైలాగ్స్.. ఇవన్నీ ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి. కాకుంటే.. ఒక కొత్త రకమైన ట్రీట్మెంట్ తో సడెన్ గా వచ్చి పడే ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది.
ఫస్ట్ హాఫ్ లో గ్లామర్ డాల్ గా ఉన్న హీరోయిన్ క్యారెక్టర్.. సెకండ్ హాఫ్ కి బూస్టప్ ఇవ్వడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఒకానొక దశలో కథ భారం మొత్తం జాను క్యారెక్టర్ పై పడి.. కథని డ్రైవ్ చేయడం విశేషం. నిజానికి ఆ సీక్వెన్స్ మొత్తం బాగా పండింది. దీనికి తోడు సెకండ్ హాఫ్ లో హీరో ఫాథర్ క్యారెక్టర్ కనిపించిన ప్రతి సన్నివేశం.. సినిమాకి ఊపిరి పోసేసింది. ఇక ప్రీ క్లైమ్యాక్స్ బాధ్యత హీరో తీసుకోని అందులో సక్సెస్ అవ్వగా… కొత్త ముగింపుతో దర్శకుడు సూపర్బ్ అనిపించాడు.
దర్శకుడు ఎందుకు ఈ చిత్రానికి బబుల్ గమ్ అని పేరు పెట్టాడో తెలియదు గాని.. టైటిల్ కి తగ్గట్టే ఫస్ట్ హాఫ్ అంతా సాగదీసి వదిలేశాడు. కానీ.. అసలు కథ, ఎంగేజింగ్ ఎలిమెంట్స్, ఎమోషనల్ సీన్స్ అన్నీ సెకండ్ హాఫ్ లో ఫుల్ గా నింపేశాడు. ఇక్కడే డిజాస్టర్ గా మిగిలిపోయింది అనుకున్న ఈ చిత్రం చాలా రెట్లు మెప్పించి.. ఒక ఫీల్ గుడ్ టచ్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యింది. అయితే.. ఇలాంటి కొత్త నటీనటులతో ఇంత సన్నటి భావోద్వేగాలతో కూడిన చిత్రాన్ని తెరకెక్కించాలని సాహసించడం ఒక రకంగా రిస్క్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రయత్నంలో దర్శకుడు కొంత మేరే సక్సెస్ అయ్యాడు.
బబుల్ గమ్ చిత్రంలో ముందుగా చెప్పుకోవాల్సింది రోషన్ కనకాల స్క్రీన్ ప్రెజెన్స్ గురించి. ఆదిత్య అనే కుర్రాడి క్యారెక్టర్ కి రోషన్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. రోషన్ లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అన్నీ బాగున్నాయి. మొదటి సినిమాకే ఈ మాత్రం ఔట్ పుట్ ఇచ్చాడంటే రోషన్ కి మంచి ఫ్యూచర్ ఉన్నట్టే. ఇక హీరోయిన్ మానస చౌదరి ఆకట్టుకుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో హీట్ పెంచేసింది. నటన పరంగా కూడా ఓకే అనిపించింది. అయితే.. హీరో ఫాథర్ రోల్ చేసిన నటుడు మాత్రం బబుల్ గమ్ మూవీకి పెద్ద ప్లస్. ఇక వైవా హర్ష, హర్ష వర్ధన్ వంటి నటులు తమ పాత్రల పరిధి మేర పరవాలేదు అనిపించారు.
‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ చిత్రాలతో గుర్తింపు దక్కించుకున్న రవికాంత్ పేరేపు ‘బబుల్ గమ్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే.. ఆ రెండు చిత్రాల్లో ఉన్న క్లారిటీ ఇక్కడ మిస్ అయ్యింది. కాకుంటే.. రోషన్ కనకాల, మానస చౌదరి దగ్గర నుండి మంచి నటన రాబట్టుకోవడంలో దర్శకుడు సూపర్ సక్సెస్ అయ్యాడు. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా.. శ్రీ చరణ పాకాల అందించిన బీజీఎం అదిరిపోయింది. ఇక సురేశ్ రగుటు సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా.. ఎడిటర్ కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదన్న విషయం అర్థం అవుతోంది. ఇక చివరగా మహేశ్వరి మూవీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరి మాట: బబుల్ గమ్.. కాస్త ఎక్కువ సాగింది.
రేటింగ్: 2.25/5