iDreamPost
android-app
ios-app

సుమ షాకింగ్ కామెంట్స్.. హఠాత్తుగా నేను చనిపోతే నా పిల్లలకు..!

  • Author Soma Sekhar Published - 04:08 PM, Tue - 24 October 23

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నయాంకర్ సుమ తన పిల్లలను తలచుకుని షాకింగ్ కామెంట్స్ చేసింది. హఠాత్తుగా నేను చనిపోతే.. అందుకే నా పిల్లలకు ఆ విషయాలను ముందుగానే చెప్పా అంటూ షాకింగ్ విషయాలు వెల్లడించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నయాంకర్ సుమ తన పిల్లలను తలచుకుని షాకింగ్ కామెంట్స్ చేసింది. హఠాత్తుగా నేను చనిపోతే.. అందుకే నా పిల్లలకు ఆ విషయాలను ముందుగానే చెప్పా అంటూ షాకింగ్ విషయాలు వెల్లడించింది.

  • Author Soma Sekhar Published - 04:08 PM, Tue - 24 October 23
సుమ షాకింగ్ కామెంట్స్.. హఠాత్తుగా నేను చనిపోతే నా పిల్లలకు..!

యాంకర్ సుమ.. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన చలాకీ మాటలతో పంచులు వేస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకుంది. ఇక కుర్ర హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు దాదాపు అందరి సినిమా వేడుకల్లో తన యాంకరింగ్ తో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘బబుల్ గమ్’ మూవీతో అతడు వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈ క్రమంలో కొడుకు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ఫుల్ బిజీగా ఉంటోంది సుమ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన పిల్లలను తలచుకుని షాకింగ్ కామెంట్స్ చేసింది. హఠాత్తుగా నేను చనిపోతే.. అందుకే నా పిల్లలకు ఆ విషయాలను ముందుగానే చెప్పా అంటూ షాకింగ్ విషయాలు వెల్లడించింది.

‘బబుల్ గమ్’ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు యాంకర్ సుమ కొడుకు రోషన్. విడుదలకు సిద్దంగా ఉన్న ఈ మూవీ టీజర్ ను ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక తన కొడుకు మూవీకి దగ్గరుండి పబ్లిసిటీ ఇస్తూ వస్తోంది సుమ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కుటుంబానికి సంబంధించి ఎమోషనల్ అయ్యారు. తన పిల్లలను తలచుకుని భావోద్వేగానికి లోనైయ్యారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ..”నాకు సంబంధించిన ఇన్సూరెన్స్ ల గురించి అన్ని విషయాలను నేను నా పిల్లలకు వివరంగా చెప్పాను. ఎందుకంటే? నేను హఠాత్తుగా చనిపోతే.. నేను కట్టిన ఇన్సూరెన్స్ ద్వారా ఎవరికి ఎంత వస్తుంది? ఎక్కడెక్కడి నుంచి ఎంత మెుత్తంలో డబ్బు వస్తుంది? అన్న విషయాలు అన్ని వారికి తెలియాలి.

అయితే నేను ఇలా చనిపోవడం గురించి మాట్లాడగానే.. ఎందుకు అమ్మ ఇలా మాట్లాడుతున్నావ్ అని వారు ప్రశ్నించారు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలీదు. అందుకే ఈ విషయాలు మీకు తెలియాలి” అని చెప్పుకొచ్చినట్లు సుమ తెలిపారు. కాగా.. చాలా మంది స్త్రీలకు తన భర్త చనిపోయిన తర్వాత పిల్లలను ఎలా పోషించాలి? అన్న ప్రశ్న ఎదురౌతుంది. ఇలాంటి ప్రశ్న తన పిల్లలకు ఎదురుకాకూడదని అన్ని విషయాలు వారికి చెప్పుకొచ్చాను అని సుమ పేర్కొంది. ప్రస్తుతం సుమ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సుమ చెప్పింది నిజమే కదా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ.. ఆమె వ్యాఖ్యలను షేర్ చేస్తున్నారు. మరి యాంకర్ సుమ ముందుచూపుతో తన పిల్లలకు చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş