iDreamPost
android-app
ios-app

Bubblegum: ఓటీటీలోకి యాంకర్‌ సుమ కుమారుడి సినిమా!

  • Published Jan 11, 2024 | 5:22 PM Updated Updated Jan 11, 2024 | 5:22 PM

బబుల్‌ గమ్‌ సినిమా గత ఏడాది డిసెంబర్‌ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సుమ కుమారుడి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

బబుల్‌ గమ్‌ సినిమా గత ఏడాది డిసెంబర్‌ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సుమ కుమారుడి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

  • Published Jan 11, 2024 | 5:22 PMUpdated Jan 11, 2024 | 5:22 PM
Bubblegum: ఓటీటీలోకి యాంకర్‌ సుమ కుమారుడి సినిమా!

టాలీవుడ్‌ టాప్‌ యాంకర్‌ సుమ కనకాల కుమారుడు రోషన్‌ కనకాల హీరోగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బబుల్‌ గమ్‌ చిత్రంలో అతడు హీరో అయ్యాడు. ఈ సినిమా 2024, డిసెంబర్‌ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, ఈ చిత్రానికి ప్రేక్షకులతో పాటు రివ్యూవర్ల దగ్గరినుంచి కూడా మంచి స్పందన వచ్చింది. అయితే, వసూళ్లను రాబట్టడంలో బబుల్‌గమ్‌ సత్తా చాటలేకపోయింది. కలెక్షన్ల విషయంలో ఈ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌ చాలా వెనకబడిపోయింది.

ఇక, బబుల్‌ గమ్‌ సినిమా ఓటీటీకి సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అతి త్వరలో బబుల్‌ గమ్‌ ఓటీటీలోకి రానుందట. థియేటర్లలో విడుదలై మూడు వారాలు కాకముందే ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ బబుల్‌ గమ్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీ ఎప్పుటినుంచి స్ట్రీమింగ్‌ అవ్వనుందో కూడా తెలియాల్సి ఉంది.

కాగా, ఈ సినిమాలో రోషన్‌ కలకాల సరసన ‘‘ మానస చౌదరి’’ నటించారు. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రోషన్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. రోషన్‌కు మంచి భవిష్యత్తు ఉందని పలువురు సినీ విమర్శకులు అన్నారు. ఇక, తెలుగు అమ్మాయి మానస నటనపై కూడా ప్రశంసల జల్లులు కురిశాయి.

ఇంతకీ బబుల్‌ గమ్‌ సినిమా కథ ఏంటంటే..

ఆది ( రోషన్ కనకాల) ఓ పక్కా హైదరాబాది మధ్యతరగతి కుర్రాడు. డీజే అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. అలాంటి ఆది జీవితంలోకి అనుకోకుండా పెద్దింటి అమ్మాయి జాను ( మానస చౌదరి) వస్తుంది. ప్రేమ, పెళ్లి వంటి ఎమోషన్స్ కి దూరంగా ఉండే అమ్మాయి జాను. ఆమె అబ్బాయిల్ని కేవలం ఒక టాయ్ లాగా చూస్తూ ఉంటుంది. ఆదిని కూడా అలాగే ట్రీట్ చేస్తుంది. కానీ.., ఆమెకు తెలియకుండానే పూర్తిగా ఆది ప్రేమలో పడిపోతుంది. రెండు వేరువేరు నేపథ్యాలు కలిగిన వీరి ప్రేమ చివరికి ఎలాంటి మలుపు తీసుకుంది? వీరిద్దరూ చివరికి కలిసిపోయారా? లేదా? అన్నదే మిగిలిన కథ. మరి, బబుల్‌ గమ్‌ ఓటీటీ రిలీజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibom