iDreamPost
android-app
ios-app

Heroine: బబుల్ గమ్ బ్యూటీ తెలుగమ్మాయని తెలుసా.. అమ్మడి బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా

  • Published Dec 27, 2023 | 11:51 AM Updated Updated Dec 27, 2023 | 11:51 AM

ప్రముఖ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న బబుల్‌గమ్ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది మానస చౌదరి. అయితే ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేని ఈ బ్యూటీ ఒక తెలుగమ్మాయట. ఈ అమ్మడు బ్యాగ్రౌండ్ మాములుగా లేదు.

ప్రముఖ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న బబుల్‌గమ్ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది మానస చౌదరి. అయితే ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేని ఈ బ్యూటీ ఒక తెలుగమ్మాయట. ఈ అమ్మడు బ్యాగ్రౌండ్ మాములుగా లేదు.

  • Published Dec 27, 2023 | 11:51 AMUpdated Dec 27, 2023 | 11:51 AM
Heroine: బబుల్ గమ్ బ్యూటీ తెలుగమ్మాయని తెలుసా.. అమ్మడి బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా

మానస చౌదరి.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోవచ్చు. కానీ ‘బబుల్‌గమ్’ సినిమా హీరోయిను అంటే మాత్రం టక్కున గుర్తుపడతారు. ప్రముఖ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న తాజా చిత్రం ‘బబుల్‌గమ్’. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగమ్మాయి మానస చౌదరి హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఇటీవలే ఈ సినీమాకి సంబంధించిన టీజర్ , ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇక అందుల్లో మానస అందం తో పాటు రోషన్ తో ఉండే కెమిస్ట్రీ చూసి యూత్ ఫిదా అయిపోయారు. కుర్రాకారులను మైమరిపించే మరో యాంగ్ బ్యూటీ టాలీవుడ్ లో అడుగుపెట్టనుంది. ఇది ఇలా ఉంటే.. తాజాగా ఈ చిన్నాది ఆమె ఊరు, బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనే పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా బబుల్‌గమ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మానస చౌదరి తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో ముచ్చటించారు. ఆమె పుట్టింది చిత్తూరు జిల్లాలోని పుత్తూరు అని, పెరిగింది చెన్నైలో అని మానస చెప్పింది. అలాగే తన తండ్రి వ్యాపారం చేస్తారని, తనకు ఎటువంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదని వెల్లడించింది. కానీ, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తానని తన తల్లిదండ్రులకు చెప్పినప్పుడు మాత్రం వారు తనకు ఎంతో ప్రోత్సాహం అందించారని తెలిపింది. అలాగే చదువు పూర్తయిన వెంటనే మోడలింగ్ చేశానని, ఆ తర్వాత ఒక స్నేహితుడి ద్వారా దర్శకుడు రవికాంత్‌కు తన ప్రొఫైల్ పంపించానని మానస తెలిపింది. ఈ క్రమంలోనే.. రవికాంత్ టీమ్ నుంచి తనకు కాల్ వచ్చిందని, ఆ తర్వాత ఫొటో షూట్ చేశామని.. అలా తన సినిమా జర్నీ మొదలైందని చెప్పుకొచ్చింది.

ఇక దర్శకుడు రవికాంత్ ‘బబుల్‌గమ్’కథ చెప్పినప్పుడు తనకు చాలా నచ్చిందని.. 22 ఏళ్ల వయసులో ఉన్నవాళ్లు ఎలా ఉంటారో ఆయన చెప్పిన కథలో పాత్రలు కూడా అలానే ఉన్నాయని మానస చెప్పింది. అలాగే ఈ కథ రియలిస్టిక్‌గా లవ్, రెస్పెక్ట్ గురించి ఉంటుందని, ఇందులో ఉండే సన్నివేశాలు కొన్ని బోల్డ్ అనడం కంటే.. చాలా బ్యూటీఫుల్‌గా ప్రెజెంట్ చేశారని చెప్పవచ్చు. కాగా, రవికాంత్ ఆయన టీమ్ చాలా సరదాగా ఉంటారని మానస తెలిపింది. అంతేకాకుండా.. చిత్ర యూనిట్ సెట్‌లో తనని ఎంతో అప్యాయం, గౌరవం చూపించారని పేర్కొంది. ఇక యాంకర్ సుమ తనయుడు హీరో అనగానే తన భవిష్యత్తు చాలా బాగుంటుందని ఏమాత్రం అలోచించకుండా సినిమా ఒకే చెప్పనని మానస తెలిపింది.

కాగా, సినిమా విషయానికి వస్తే.. ఈ బబుల్‌గమ్ సినిమాలో తాను జాన్వి పాత్రలో కనిపిస్తానని, ఇందులో తానొక ఫ్యాషన్ డిజైనర్‌ని అని మానస తెలిపింది. ఇక ఈ సినిమా చేయడానికి ముందు ‘ఎమోజీ’ అనే వెబ్ సిరీస్‌లో తాను నటించానని చెప్పింది. అయితే అప్పటికి తనకు నటన తనకు కొత్త అని, బబుల్‌గమ్ తో చాలా మెరుగయ్యానని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో జాన్వీ పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చుతుందనే నమ్మకం తనకు ఉందని వెల్లడించింది. అలాగే, రోషన్ నుంచి తాను చాలా నేర్చుకున్నానని, రోషన్‌కి నటనపై మంచి పట్టు ఉందని.. ఈ సినిమాతో అతను నేర్చుకోవడంతో పాటు తనకు కూడా చాలా విషయాలు నేర్పించాడని తెలిపింది. మరి, బబుల్‌గమ్ సినిమాతో పరిచయం అవుతున్న మానస గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet