iDreamPost
android-app
ios-app

వీడియో: కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ సుమ

  • Published Dec 25, 2023 | 4:12 PM Updated Updated Dec 25, 2023 | 4:12 PM

రాజీవ్ కనకాల- యాంకర్ సుమ కుమారుడు హీరోగా వస్తున్న విషయం తెలిసిందే. రోషన్ నటించిన బబుల్ గమ్ సినిమాకి సంబంధించి ప్రీ బుకింగ్ ఈవెంట్ జరిగింది.

రాజీవ్ కనకాల- యాంకర్ సుమ కుమారుడు హీరోగా వస్తున్న విషయం తెలిసిందే. రోషన్ నటించిన బబుల్ గమ్ సినిమాకి సంబంధించి ప్రీ బుకింగ్ ఈవెంట్ జరిగింది.

  • Published Dec 25, 2023 | 4:12 PMUpdated Dec 25, 2023 | 4:12 PM
వీడియో: కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ సుమ

రాజీవ్ కనకాల- యాంకర్ సుమ.. ఈ కపుల్ కు టాలీవుడ్ లో ఎంతో మంచి క్రేజ్ మాత్రమే కాదు ఫ్యాన్ బేస్ కూడా ఉంది. రాజీవ్ యాక్టర్ గా.. సుమ యాంకర్ గా బుల్లితెర నుంచి వెండితెర వరకు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు వీళ్ల ఫ్యామిలీ నుంచి వెండితెరకు హీరో పరిచయమవుతున్న విషయం తెలిసిందే. రోషన్ కనకాల బబుల్ గమ్ సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ మూవీకి సంబంధించి ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోషన్ మాటలకు సుమ కన్నీళ్లు పెట్టుకుంది.

బబుల్ గమ్ సినిమా ప్రీ బుకింగ్ ఈవెంట్ సస్కెస్ ఫుల్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు అడవి శేషు, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కు చాలా మంచి రెస్పాన్స్ లభించింది. ఒక సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు అనిపిస్తోంది. ఒక సరికొత్త యూత్ ఫుల్ లవ్ స్టోరీ కావడంతో అందరూ కనెక్ట్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రీ బుకింగ్ ఈవెంట్ లో ఒక ఎమోషనల్ విషయం కూడా జరిగింది. అదేంటంటే.. సినిమా గురించి రోషన్ కనకాల మాట్లాడాడు. తన టీమ్, క్రూ అందరికీ శుభాకాంక్షలు చెప్పాడు. ప్రొడక్షన్ బాయ్ దగ్గరి నుంచి అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపాడు.

అలాగే రోషన్ తనకు సంబంధించిన ఒక విషయం గురించి ఓపెన్ కామెంట్స్ చేశాడు. తాను అసలు హీరో ఏంటి అంటూ కొందరు అన్న మాటలను ప్రస్తావించాడు. “నేను ఈ స్టేజ్ మీద ఒక విషయాన్ని మాట్లాడాలి అనుకుంటున్నాను. నా గురించి నేను చాలా మాటలు నా వెనుక మాట్లాడినవి విన్నాను, నేను చాలా మాటలు చదివాను. అసలు వీడు హీరో ఏంది? కర్రిగున్నాడు వీడు హీరోగా చేస్తాడా? అంటూ మాట్లాడారు. నేను ఇలాగే పుట్టా.. ఇలాగే ఉంటాను. నీ లైఫ్ ని డిసైడ్ చేసేది నీ హార్డ్ వర్క్, నీ టాలెంట్. అదే నిన్ను డిసైడ్ చేస్తుంది” అంటూ రోషన్ కామెంట్స్ చేశాడు. రోషన్ మాటలకు రాజీవ్ కనకాల ఎంతో మురిసిపోయారు. తన కొడుకుని గర్వంగా చూస్తూ నవ్వుతూ ఉండిపోయారు.

యాంకర్ సుమ మాత్రం ఎమోషనల్ అయ్యారు. నేను ఇలాగే పుట్టా.. ఇలాగే ఉంటాను అంటూ రోషన్ అనగానే సుమ కన్నీళ్లు పెట్టుకున్నారు. కొడుకును చూస్తూ ఏడ్చేశారు. ఏ తల్లిదండ్రులైనా తమని ఏమన్నా కూడా పట్టించుకోరు. కానీ, కొడుకు గురించి మాట్లాడితే మాత్రం కచ్చితంగా హర్ట్ అవుతారు. సుమ కూడా అలాంటి మాటలు విన్నారు కావచ్చు. అందుకే రోషన్ ఆ కామెంట్స్ చేయగానే సుమ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంక సినిమా విషయానికి వస్తే.. ఒక ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా కనిపిస్తోంది. హీరో- హీరోయిన్- మధ్యలో విలన్ ఉన్నట్లు చూపించారు. మరి.. వీళ్ల కథ ఎటు సాగుతుంది? హీరో- హీరోయిన్ లవ్ సక్సెస్ అవుతుందా అనే విషయం తెలియాలంటే డిసెంబర్ 29 వరకు ఆగాల్సిందే. మరి.. సుమ కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom