iDreamPost
android-app
ios-app

సమన్వయకర్తల ఐదో జాబితా విడుదల చేసిన YSRCP

  • Published Jan 31, 2024 | 9:11 PM Updated Updated Jan 31, 2024 | 9:11 PM

YSRCP 5th List: వైఎస్సార్ సీపీ అసెంబ్లీ, నియోజకవర్గాలకు సమన్యవకర్తలను నియమిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఐదో జాబితాను విడుదల చేశారు.

YSRCP 5th List: వైఎస్సార్ సీపీ అసెంబ్లీ, నియోజకవర్గాలకు సమన్యవకర్తలను నియమిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఐదో జాబితాను విడుదల చేశారు.

  • Published Jan 31, 2024 | 9:11 PMUpdated Jan 31, 2024 | 9:11 PM
సమన్వయకర్తల ఐదో జాబితా విడుదల చేసిన YSRCP

అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల బరిలోకి దిగే నాయకుల విషయంలో వైఎస్సార్ సీపీ మార్పులు చేర్పులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ ఛార్జులను మారుస్తూ నాలుగు జాబితాలను విడుదల చేశారు. తాజాగా వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జుల ఐదో జాబితాను కూడా విడుదల చేసింది. వైసీపీ ఇన్ ఛార్జుల ఐదో జాబితాను పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మీడియాకి వెల్లడించారు. మొత్తం 4 ఎంపీ, 3 అసెంబ్లీ స్థానాలకు ఇన్ ఛార్జులను ప్రకటిస్తూ ఐదో జాబితాను విడుదల చేశారు. ఐదో జాబితా విడుదల క్రమంలోనే కొందరికి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.

పార్టీ రీజనల్ కో-ఆర్టినేటర్ విజయసాయిరెడ్డికి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అదనపు బాధ్యతలను అప్పగించారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ రీజినల్ కోఆర్డినేటర్ గా చవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పారు. కందుకూరు, కావలి, సంతలనూతపాడు రీజినల్ కోఆర్టినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు. ఇప్పటివరకు మొత్తం ఐదు జాబితాలను విడుదల చేశారు. తొలి జాబితాలో 11 ఎమ్మెల్యే నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. రెండో జాబితాలో 3 ఎంపీ, 24 ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను నియమించారు. మూడో జాబితాలో 6 ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాలకు ఇన్ ఛార్జులను నియమించారు. నాలుగో జాబితాలో 1 ఎంపీ, 8 అసెంబ్లీ స్థానాలకు ఇన్ ఛార్జులను నియమించారు. తాజాగా 4 ఎంపీ, 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తూ ఐదో జాబితాను విడుదల చేశారు.

ఐదో జాబితా:

  • కాకినాడ ఎంపీ- చలమలశెట్టి సునీల్
  • నరసరావుపేట ఎంపీ- పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్
  • తిరుపతి ఎంపీ(ఎస్సీ)- మద్దిల గురుమూర్తి
  • మచిలీపట్నం ఎంపీ- సింహాద్రి రమేశ్ బాబు
  • అరుకు వేలీ ఎమ్మెల్యే- రేగం మత్స్య లింగం
  • సత్యవేడు ఎమ్మెల్యే- నూకతోటి రాజేశ్
  • అవనిగడ్డ ఎమ్మెల్యే- డా. సింహాద్రి చంద్రశేఖర్ రావు

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetewin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom