iDreamPost
android-app
ios-app

శ్రీకాకుళం నుంచి మొద‌లైన‌ మంత్రుల బస్సుయాత్ర

  • Published May 26, 2022 | 12:16 PM Updated Updated May 26, 2022 | 12:16 PM
శ్రీకాకుళం నుంచి మొద‌లైన‌ మంత్రుల బస్సుయాత్ర

శ్రీకాకుళం నుంచి మంత్రుల బస్సుయాత్ర ప్రారంభమైంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జరిగిన సామాజిక న్యాయాన్ని వివరించడానికి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్రను చేప‌ట్టింది. గురువారం ఉదయంం ప్రారంభమైన వైఎస్సార్‌సీపీ బస్సు యాత్రలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు పాలనలో భాగస్వామ్యం కోసం సుదీర్ఘ‌ పోరాటాలు చేశాయి. కాని తొలిసారి, 74 శాతం మంది మంత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వారే. చరిత్రలో సీఎం వైఎస్‌ జగన్ ఒక్కరే చేయగలిగారు. ఇలా చేయమని సీఎం జగన్‌కు ఎవరూ అడగలేదు.. ఆయనే అవకాశం కల్పించార‌ని అన్నారు.

ప్రభుత్వ పథకాల్లో 82 శాతం మేర‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారు. దానిని కొందరు హేళన చూస్తున్నారు. ఇలా చౌక‌బారు విమర్శలు చేసే వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అవమానించినట్టే. ఇంత‌కుముందు ప‌రిస్థితి ఎలా ఉండేది? నాయకులకు సలాం కొడితే పథకాలు ఇచ్చేవాళ్లు. కానీ ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఎవరికీ తల వంచాల్సిన అవ‌స‌రంలేదు. చంద్రబాబు రాష్ట్ర మంతా తిరిగాడు. కానీ, మేం ఇచ్చిన పథకాల్లో తప్పు జరిగిందని చెప్పగలిగాడా? ఇంకో మాట‌కూడా అన్నారు ధ‌ర్మాన‌. ఏ బీసీ అయినా తల వంచే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేద‌ని అన్నారు..

పశుసంవర్ధక శాఖా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేస్తున్న సంఘసంస్కర్త సీఎం జగన్ అని ప్ర‌శంసించారు. ఆ వర్గాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రజలకి వాస్తవాలు వివరించేందుకు బస్సు యాత్ర చేస్తున్నామ‌ని చెప్పారు.