iDreamPost
android-app
ios-app

AP ప్రభుత్వంపై భాస్కర్ పంచ్ లు.. ఫ్యాన్స్ దెబ్బకు క్షమాణలు చెప్పిన వైనం!

AP ప్రభుత్వంపై భాస్కర్ పంచ్ లు.. ఫ్యాన్స్ దెబ్బకు క్షమాణలు చెప్పిన వైనం!

జబర్దస్త్ కామెడీ షోకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆదరణ ఉంది. ముఖ్యంగా ఈ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. చాలా మంది తెలుగు ఇండస్ట్రీలో కమేడియన్స్ గా కొనసాగుతున్నారు కూడా. అలా జబర్దస్త్ వల్ల పేరు తెచ్చుకున్న వారిలో బుల్లెట్ భాస్కర్ కూడా ఒకరు. టీమ్ లీడర్ గా కొనసాగుతూ అటు సినిమాల్లో కూడా అవకాశాలు పొందుతున్నాడు. స్కిట్స్ లో వాళ్ల నాన్నను కూడా కమెడియన్ గా పరిచయం చేశాడు. అయితే ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ పై ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జబర్దస్త్ షో ద్వారా బుల్లెట్ భాస్కర్ కి మాత్రమే కాదు.. వాళ్ల నాన్నకు కూడా మంచి పేరు వచ్చింది. టీమ్ లీడర్ గా, కమెడియన్ గా కొనసాగుతున్న సమయంలో బుల్లెట్ భాస్కర్ లేనిపోని చిక్కులు తెచ్చుకున్నాడు. తన స్కిట్టులో అత్యుత్సాహంతో ఏపీ ప్రభుత్వంపై పంచ్ లు వేశాడు. వైసీపీ అభిమానులు రంగంలోకి దిగడంతో చేసేది లేక చివరకు క్షమాపణలు కూడా చెప్పుకున్నాడు. అయినా బుల్లెట్ భాస్కర్ తీరుపై ఏపీ ప్రజలు, వైసీపీ అభిమానులు మాత్రం గుర్రుగానే ఉన్నారు.

అసలు ఏం జరిగిందంటే.. తాజాగా విడుదలైన ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ స్కిటుకు సంబంధించి వివాదం నెలకొంది. ఆ స్కిట్టులో నరేష్, భాస్కర్ తల్లిదండ్రులు కూడా నటించాడు. అందులో నటి బావగారు సినిమాకి తీసుకెళతారా అని అడగ్గా.. సెకండ్ షోకి వెళ్లకమ్మా వాడికి కళ్లు కనపడవు అని సమాధానం చెబుతాడు. ఆయనకు నెల ఆదాయం ఎంత అని అడగ్గా.. రూ.2,750 వస్తుందని చెబుతుంది. మరేమీ పెరగదా అని ప్రశ్నించగా.. భాస్కర్ తల్లి “ఇంకేం పెరగదు.. మళ్లీ ప్రభుత్వం మారితేనే పెరుగుతుంది” అంటూ పంచ్ వేస్తుంది.

ఇదంతా ఏపీ ప్రభుత్వంలో ఇస్తున్న పెన్షన్ మీద వేసిన పంచులు. ఏపీ ప్రభుత్వం మారితేనే పెన్షన్ పెరుగుతుంది అనే మాటలపై వైసీపీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పెన్షన్ ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు ఎంత వస్తోంది? ఆలోచించి మాట్లాడాలి. అయినా రాజకీయాలపై పంచులు సరైన వేదికలపై వేయాలి. ఇలాంటి స్టేజులపై కేవలం కామెడీ మాత్రమే చేయాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఫ్యాన్స్ అంతా బుల్లెట్ భాస్కర్ ని టార్గెట్ చేయడంతో అందరికీ క్షమాపణలు చెప్పాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet