SNP
TS Election Results 2023, YSRTP: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది. అయితే.. ఈ ప్రభుత్వంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల్‌కు కీలక పదవి ఇచ్చే అవకాశం ఉంది.
TS Election Results 2023, YSRTP: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది. అయితే.. ఈ ప్రభుత్వంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల్‌కు కీలక పదవి ఇచ్చే అవకాశం ఉంది.
SNP
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 64 స్థానాల్లో గెలుపొంది.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇక రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ కేవలం 39 సీట్లుకు మాత్రమే పరిమితం అయింది. కాంగ్రెస్ సాధించిన ఈ విజయానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది.. ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్ని ఏకం కావడమే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి.. సీపీఐ, తెలంగాణ జన సమితి, తెలుగుదేశంతో పాటు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం మద్దుతు తెలిపింది. దీంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు అవకాశం లేకుండా పోయింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి.. కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి.. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు. కానీ, తీరా ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయి.. పార్టీకి బేషరుతుగా మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేయకపోయినా.. పూర్తి మద్దతు తెలపడంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలలేదు. ఒక వేళ వైఎస్సార్ టీపీ అభ్యర్థులను నిలబెట్టి ఉంటే.. ఎన్నో కొన్ని ఓట్లు కచ్చితంగా చీలేవి. వాటిలో ఎక్కువగా కాంగ్రెస్‌కు పడాల్సిన ఓట్లు ఉంటాయి. ఇలా కాంగ్రెస్‌కు నష్టం జరగకుండా.. కేసీఆర్‌ను గద్దె దించడం కోసం కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని షర్మిల్ తీసుకున్న నిర్ణయం హస్తం పార్టీకి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.
ఇక ఈ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వంటి సీనియర్ నేతుల.. వైఎస్సార్ ని విపరీతంగా అభిమానిస్తారు. పైగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో షర్మిల.. వైఎస్సార్ అభిమాన ఓటు చీలకుండా.. కాంగ్రెస్ ను ఆదుకున్నారనే విశ్వాసం వారిలో ఉంది. అటు కాంగ్రెస్ హైకమాండ్‌తో కూడా షర్మిలకు మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం కాంగ్రెస్‌లో అగ్రనేతగా ఎదుగుతున్న డీకే శివకుమార్ సైతం షర్మిల్‌కు మంచి ప్రాధాన్యత ఇస్తారని ఇన్ సైడ్ టాక్.
వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని.. షర్మిలకు కీలక పదవి ఇస్తారంటున్నారు వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలు. ప్రస్తుతం దీనిపై జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తంగా షర్మిలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవీ బాధ్యతలు రావడం ఖాయంగానే కనిపిస్తున్నా.. షర్మిల పదవిని స్వీకరిస్తారా? లేదా? అన్నది చూడాలి. మరి కాంగ్రెస్ విజయంలో షర్మిల్ పాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.