SNP
YS Jagan Bus Yatra: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయలో ప్రత్యేక పార్థనలు జరిపిన తర్వాత.. ఈ యాత్రను మొదలుపెట్టారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
YS Jagan Bus Yatra: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయలో ప్రత్యేక పార్థనలు జరిపిన తర్వాత.. ఈ యాత్రను మొదలుపెట్టారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
SNP
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సీఎం జగన్‌మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను చేపట్టారు. ఈ యాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానుంది. ప్రజలకు తాము అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. ఈ యాత్ర సాగనుంది. ఈ బస్సు యాత్ర ప్రారంభానికి ముందు.. సీఎం జగన్ ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి ప్రార్థనలు జరిపారు. ఈ ప్రార్థనల్లో జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కూడా పాల్పొన్నారు. తల్లితో కలిసి జగన్ వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక పార్థనలు జరిపారు. ఈ ప్రార్థనల తర్వాత జగన్ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. 1.30 గంటలకు ఇడుపులపాయ నుంచి ప్రారంభమై.. కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి, గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల, పొట్లదుర్తి మీదుగా సాయంత్రం 4.30 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. అక్కడ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు.
అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చేరుకుంటారు. ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో బస చేస్తారు. తొలి రోజు మొత్తంగా 115 కిలోమీటర్ల పాటు బస్సు యాత్ర కొనసాగుతుంది. కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ చేసిన ఆ పాదయాత్ర తెలుగురాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్రగా మిగిలిపోయింది. ఆ పాదయాత్రలో జగన్‌తో జనం కలిసి నడిచి, ఆయనకు భారీ మెజార్టీతో అధికారం ఇచ్చారు. ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాకా.. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి.. ఇప్పుడు మరోసారి గెలుపే లక్ష్యంగా ఈ బస్సు యాత్రను చేపట్టారు సీఎం జగన్. గతంలో చేసిన పాదయాత్రకు ఎలాంటి స్పందన వచ్చిందో.. ఈ బస్సు యాత్రకు కూడా అంతకు మంచి ప్రజల నుంచి మద్దతు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ బస్సు యాత్రకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.