iDreamPost
android-app
ios-app

టీడీపీ కీలక నిర్ణయం.. అక్కడ BRS పార్టీ అభ్యర్థికి మద్దతు

  • Published Nov 28, 2023 | 9:54 AM Updated Updated Nov 28, 2023 | 9:54 AM

తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన టీడీపీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ కు మద్దతిస్తోన్న టీడీపీ.. ఓ చోట మాత్రం.. బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపింది. ఎక్కడంటే..

తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన టీడీపీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ కు మద్దతిస్తోన్న టీడీపీ.. ఓ చోట మాత్రం.. బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపింది. ఎక్కడంటే..

  • Published Nov 28, 2023 | 9:54 AMUpdated Nov 28, 2023 | 9:54 AM
టీడీపీ కీలక నిర్ణయం.. అక్కడ BRS పార్టీ అభ్యర్థికి మద్దతు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. నవంబర్ 30న అనగా గురువారం నాడు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడిస్తారు. ఇక ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమయ్యింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటికి దూరంగా ఉన్న టీడీపీ.. తాజాగా ఎన్నికలకు కొన్ని గంటల ముందు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన టీడీపీ.. ఒక్కచోట మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్న నేపథ్యంలో.. మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ కు మద్దతిస్తోన్న టీడీపీ.. తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. అది కూడా హైదరాబాద్‌లో కీలకంగా ఉన్న శేరిలింగంపల్లిలో. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి అరికపూడి గాంధీకి మద్దతిస్తోన్నట్లు ప్రకటించింది టీడీపీ.

అభివృద్ధితో పాటు స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని స్థానిక టీటీడీపీ డివిజన్ల అధ్యక్షులు ప్రకటించారు. గాంధీ గెలుపు కోసం కృషి చేస్తామని.. కొండాపూర్, గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్, హఫీజ్ పేట్, ఆల్విన్ కాలనీ, డివిజన్ల అధ్యక్షులు ప్రకటించారు. ఇప్పుడున్న అభ్యర్థుల్లో ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా అందరిని ఆదరించే నాయకుడు గాంధీనేనని.. అందుకే తమ సంపూర్ణ మద్దతు ఆయనకే ఉంటుందని టీటీడీపీ నేతలు స్పష్టం చేశారు.

అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక పొత్తుల్లో భాగంగా శేరిలింగంపల్లి సీటు తమకే కేటాయించాలని జనసేన డిమాండ్ చేసింది. కానీ.. బీజేపీ నాయకులు పట్టుబట్టటంతో.. ఆ స్థానం నుంచి కాషాయ పార్టీ అభ్యర్థే బరిలో దిగారు. బీజేపీ తరఫున రవికుమార్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు.

అయితే.. ఏపీలో జనసేనతో దోస్తీ కట్టిన టీడీపీ.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌కు మద్దతివ్వటంపై సర్వత్రా చర్చ జరుగుతుండగా.. ఇప్పుడు జనసేనకు సీటు దక్కని స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థికి టీడీపీ మద్దతివ్వటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి ఫలితాలు ఎలా ఉండనున్నాయో చూడాలి.