iDreamPost
android-app
ios-app

TS Elections: తెలంగాణ ఎన్నికల పోలింగ్.. ఓటేసేందుకు చార్టెడ్ ఫ్లైట్లో వచ్చిన రామ్ చరణ్

  • Published Nov 30, 2023 | 12:00 PM Updated Updated Nov 30, 2023 | 1:05 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనాలు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ ఓటు వేసేందుకు ఏకంగా చార్టెడ్ ఫ్లైట్ లో వచ్చారు. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనాలు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ ఓటు వేసేందుకు ఏకంగా చార్టెడ్ ఫ్లైట్ లో వచ్చారు. ఆ వివరాలు..

  • Published Nov 30, 2023 | 12:00 PMUpdated Nov 30, 2023 | 1:05 PM
TS Elections: తెలంగాణ ఎన్నికల పోలింగ్.. ఓటేసేందుకు చార్టెడ్ ఫ్లైట్లో వచ్చిన రామ్ చరణ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ నేడు కొనసాగుతుంది. నవంబర్ 30, గురువారం ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని.. ఓటు వేశారు. సామాన్యులతో పాటు సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు కూడా వచ్చి క్యూలైన్లో నిల్చొని మరీ ఓటు వేస్తున్నారు. అంతేకాక ప్రతి ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ ప్రకారం.. ఒక్క హైదరాబాద్ లో తప్ప మిగతా ప్రాంతాల్లో ఆశాజనకంగానే ఉంది. ఎప్పటిలానే నగరవాసులు ఓటు వేసే విషయంలో బద్దకంగానే ఉన్నారు. ఉపాధి నిమిత్తం పట్టణానికి వచ్చిన వారంతా ఓటు వేయడం కోసం సొంతూర్లకు తరలి వెళ్లారు. కానీ నగరంలోనే ఉంటూ.. ఇక్కడే ఓటు హక్కు ఉన్నవారు మాత్రం.. ఓటు వేయడం లేదు.

ఇలాంటి వారంతా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను చూసి నేర్చుకోవాలి. ఆయన ఓటు వేయడం కోసం హైదరాబాద్ తరలి వస్తున్నారు. అది కూడా చార్టెడ్ ఫ్లైట్ లో. ఓటు వేయడం మన బాధ్యత అని బలంగా నమ్మే రామ్ చరణ్.. ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం.. ఛార్టెడ్‌ ఫైట్‌లో.. పవయనవ్వడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఇంతకు రామ్ చరణ్ ఎక్కడ ఉన్నారంటే.. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్‌లో భాగంగా.. మైసూర్‌లో ఉన్నారు. అక్కడో షెడ్యూల్‌ను కంప్లీట్ చేసే పనిలో  బిజీగా ఉన్నారు. అయితే నేడు పోలింగ్ ఉండటంతో.. మైసూరు నుంచి చార్టెడ్ ఫ్లైట్లో హైదరాబాద్ కు బయలు దేరారు.

టాలీవుడ్ సెలబ్రిటీలు మెగాస్టార్‌ చిరంజీవి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, సుమంత్, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు తమ ఓటు ఉన్న పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. అలానే స్పోర్ట్స్ సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్‌, కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌ అభ్యర్థి అజారుద్దీన్, అతని కుమారుడు అసదుద్దీన్ తదితర కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలానే టీమిండియా మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా, ప్రముఖ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని.. అది మన బాధ్యత అని గుర్తు చేస్తున్నారు సెలబ్రిటీలు.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Geek 🎥 (@thebollywoodgeek)