Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం జనాలు తరలి వచ్చారు. ఓ వ్యక్తి అయితే లక్షలు ఖర్చు చేశాడు. కానీ ఓటు వేయలేకపోయాడు. కారణమేంటంటే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం జనాలు తరలి వచ్చారు. ఓ వ్యక్తి అయితే లక్షలు ఖర్చు చేశాడు. కానీ ఓటు వేయలేకపోయాడు. కారణమేంటంటే..
Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. గురువారం నాడు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడెక్కడో ఉన్న వారు.. ఓటు వేయడం కోసం స్వస్థలలాకు తరలి వెళ్లారు. ఎప్పటి లానే ఈసారి కూడా గ్రామాల్లో భారీగా పోలింగ్ నమోదు కాగా.. హైదరాబాద్ లో అత్యల్పంగా ఓటింగ్ నమోదయ్యింది. ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం జనాలు.. స్వస్థలాలకు తరలి వెళ్తే.. పట్టణ వాసులు మాత్రం.. ఉన్న చోట నుంచి కాలు కదపలేదు.. ఓటేయ్యలేదు. ఇక కొందరైతే విదేశాల నుంచి వచ్చి మరీ ఓటు వేశారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం.. షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి.. చార్టెడ్ ఫ్లైట్లో వచ్చి ఓటు వేశారు. అలానే ఓ వ్యక్తి ఓటు వేయడం కోసం ఏకంగా 2.5 లఓలు ఖర్చు చేశాడు.. కానీ ఓటు వేయలేకపోయాడు. కారణమిదే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఓ వ్యక్తి ఖండాలు దాటి వచ్చినా.. ఓటేయలేకపోయాడు. పైగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ వ్యక్తి రూ. 2.50 లక్షలు ఖర్చు పెట్టిన ఫలితం లేకపోయింది. పోలింగ్ స్టేషన్ వద్దకు వెళ్లిన అతడికి ఓటు లేదని చెప్పటంతో నిరాశగా వెనుదిరిగాడు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్ 15 ఏళ్ల క్రితం న్యూజిలాండ్ వెళ్లాడు. అక్కడే ఓ కంపెనీలో వెల్డర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుని.. అలానే తల్లిదండ్రులతో కొద్ది రోజులు గడుపుదామని భావించి.. భార్యతో కలిసి వారం రోజుల క్రితం స్వగ్రామం చింతగూడకు వచ్చాడు.
అయితే శ్రీనివాస్ న్యూజిలాండ్‌లో ఉన్నప్పుడే ఓ స్నేహితుడి ద్వారా ఓటరు జాబితాను వాట్సప్‌లో తెప్పించుకుని చూడగా అందులో శ్రీనివాస్, లావణ్య దంపతుల పేర్లు ఉన్నాయి. అందుకే వారు ఓటు వేయడానికి వచ్చారు. న్యూజిలాండ్ నుంచి ఇండియా రావడం కోసం విమానం ఛార్జీలు, ఇతర ఖర్చుల కింద 2.50 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇక పోలింగ్ రోజున అనగా గురువారం ఉదయం ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ నెంబరు 296కు వెళ్లారు. అయితే అక్కడున్న జాబితాలో కేవలం అతని భార్య లావణ్య పేరు మాత్రమే ఉంది. దాంతో షాకవ్వడం శ్రీనివాస్ వంతయ్యింది.
అయితే తాను వాట్సప్ లో చూసిన ఓటర్ లిస్ట్ లో తన భార్య లావణ్య, తన పేరు ఉందని అధికారులకు తెలిపాడు. వాట్పాప్ లో ఉన్న ఓటర్ లిస్ట్ ను చూపించాడు. అయితే దాన్ని పరిశీలించిన అధికారులు ఆ ఓటర్ లిస్టు పాతదని.. సవరించిన జాబితాలో శ్రీనివాస్ పేరు లేదని తెలిపారు. దాంతో అవాక్కయ్యాడు శ్రీనివాస్. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. న్యూజిలాండ్ నుంచి తను, తన భార్య ఇండియాకు రావడానికి విమానం ఛార్జీలు రూ.2.50 లక్షలు అయ్యాయని.. ఇంత చేస్తే ఆఖరికి తనకు ఓటు వేసే అవకాశం రాలేదని వాపోయాడు. విషయం తెలుసుకున్న వారు అయ్యో పాపం అంటున్నారు.