iDreamPost
android-app
ios-app

బీజేపీ నయా స్ట్రాటజీ.. బండి సంజయ్‌కి హెలికాప్టర్‌

  • Published Oct 31, 2023 | 2:59 PM Updated Updated Oct 31, 2023 | 2:59 PM

తెలంగాణ ఎన్నికల్లో విజయం కోసం పార్టీలన్ని తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహాంలో భాగంగా బీజేపీ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు..

తెలంగాణ ఎన్నికల్లో విజయం కోసం పార్టీలన్ని తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహాంలో భాగంగా బీజేపీ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు..

  • Published Oct 31, 2023 | 2:59 PMUpdated Oct 31, 2023 | 2:59 PM
బీజేపీ నయా స్ట్రాటజీ.. బండి సంజయ్‌కి హెలికాప్టర్‌

తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. ఇక బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ రోజుకు రెండు, మూడు చొప్పున బహిరంగ సభల్లో పాల్గొంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ కూడా ముఖ్యనేతలతో ప్రచార కార్యక్రమాలు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. ఇక నేడు ప్రియాంక గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక బీజేపీ కూడా ఇటీవలే కేంద్ర అమిత్‌ షాతో సూర్యపేటలో సభ నిర్వహించింది. ఇక పూర్తి స్థాయి అభ్యర్థుల ప్రకటన తర్వాత అగ్రనేతలు, కేంద్ర మంత్రులతో సభలకు ప్లాన్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటంతో కమలం పార్టీ స్పీడ్‌ పెంచింది. దీనిలో భాగంగా కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సేవలను వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో ఆయనకు పార్టీ తరపున హెలికాప్టర్‌ను కేటాయించింది. బీజేపీ తెలంగాణ స్టార్ క్యాంపెయినర్‌ హోదాలో ఆయనకు ఈ అవకాశం కల్పించినట్లు పార్టీ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్‌కి ఉన్న ఫాలోయింగ్‌ను బీజేపీకి ఉపయోగపడేలా అధిష్టానం ప్రణాళిక రచించినట్లు అర్థమవుతోంది.

రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో జీహెచ్‌ఎంసీతో పాటు దుబ్బాక, హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో విజయాలు సాధించిన క్రెడిట్ బండి సంజయ్‌కి ఉంది. కార్యకర్తల్లోనూ ఆయనకు మాస్ ఇమేజ్ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పలు బహిరంగ సభల్లో బండి సంజయ్ పాల్గొనేందుకు త్వరగా సభలకు చేరుకునేందుకుగాను.. బీజేపీ ఆయనకు హెలికాప్టర్ కేటాయించినట్లు తెలిసింది. సంజయ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌తో పాటు మరొకరికి కూడా హెలికాప్టర్లు కేటాయించినట్లు సమాచారం. ఇక ప్రస్తుత ఎన్నికల్లో బండి సంజయ్‌ కరీంగనర్‌ నుంచి పోటీ చేస్తున్నారు.