iDreamPost
android-app
ios-app

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. తగ్గిన MIM హవా

  • Published Dec 03, 2023 | 12:56 PM Updated Updated Dec 03, 2023 | 12:56 PM

TS Election Result 2023, MIM: మరికొన్ని గంటల్లో తెలంగాణలో అధికారం చేపట్టబోయే పార్టీ ఏదో తెలియనుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను చూస్తే.. ఎంఐఎం హవా తగ్గినట్లు స్పష్టం అవుతోంది. ఆ వివరాలు..

TS Election Result 2023, MIM: మరికొన్ని గంటల్లో తెలంగాణలో అధికారం చేపట్టబోయే పార్టీ ఏదో తెలియనుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను చూస్తే.. ఎంఐఎం హవా తగ్గినట్లు స్పష్టం అవుతోంది. ఆ వివరాలు..

  • Published Dec 03, 2023 | 12:56 PMUpdated Dec 03, 2023 | 12:56 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. తగ్గిన MIM హవా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తుది ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కాగా.. ప్రారంభం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోనే కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఈవీఎం ఓట్ల కౌంటింగ్ లో కూడా దూసుకుపోతుంది. మ్యాజిక్ ఫిగర్ స్థానాల్లో అనగా సుమారు 69 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే కారు పార్టీ దూసుకుపోగా.. మిగతా చోట్ల చతికిలపడింది. ఖమ్మం, నల్లగొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే దిశగా పరుగులు తీస్తుంది. ఇలా ఉండగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మూడు స్థానాల్లో వెనకంజలో ఉంది.

ఈ ఎన్నికల్లో ఎంఐఎం పాతబస్తీలోని గోషామహల్ మినహా మిగిలిన చార్మినార్, యాకుత్పురా, కార్వాన్, నాంపల్లి, మలక్ పేట, చాంద్రాయణగుట్టలో బరిలో నిలిచింది. గత ఎన్నికల్లో.. హైదరాబాద్ లో పోటీ చేసిన ప్రతి చోట విజయం సాధించే ఎంఐఎం పార్టీకి ఈసారి భారీ షాక్ తగిలింది. కేవలం నాలుగు చోట్ల మాత్రమే అధిక్యంలో కొనసాగుతుండగా.. మూడు చోట్ల వెనకంజలో ఉంది. కార్వాన్, యాకుత్పురాలో బీజేపీ ముందంజలో ఉండగా.. నాంపల్లిలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. చార్మినార్ లో ఎంఐఎం విజయం సాధించింది. కానీ ఎన్నడు లేని విధంగా నగరంలో ఎంఐఎం మూడు స్థానాల్లో వెనకంజలో ఉండటం గమనార్హం. ఆ పార్టీ ప్రభావం తగ్గిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.