Dharani
తెలంగాణలో గెలవమని హస్తం పార్టీ అధిష్టానానికి అర్థం అయ్యిందా.. అందుకే అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రచారాన్ని పట్టించుకోవడం లేదా.. ఎన్నికలకు వారం రోజుల ముందే తెలంగాణ చేతులెత్తేసిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. వారు చెప్తోన్న కారణాలు..
తెలంగాణలో గెలవమని హస్తం పార్టీ అధిష్టానానికి అర్థం అయ్యిందా.. అందుకే అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రచారాన్ని పట్టించుకోవడం లేదా.. ఎన్నికలకు వారం రోజుల ముందే తెలంగాణ చేతులెత్తేసిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. వారు చెప్తోన్న కారణాలు..
Dharani
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి. ఎన్నికలకు రెండు రోజుల ముందు నుంచి ప్రచార పర్వానికి బ్రేక్ పడనుంది. అంటే ప్రచార కార్యక్రమాలకి మహా అయితే మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఓ వైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది.. మరోవైపు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అభ్యర్థుల్లో ఆందోళన మొదలయ్యింది. కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో.. పార్టీలు, అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఎన్నికల నగరా మోగిన తొలినాళ్లల్లో దూకుడుగా ముందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ.. పోలింగ్‌కు సమయం దగ్గర పడే నాటికి చేతులెత్తేసిందని.. పార్టీ అధిష్టానం, అగ్ర నేతల తీరు చూసి కార్యకర్తలు నిరాశలో కూరుకుపోతున్నారట
పోలింగ్ సమయం దగ్గర పడేనాటికి తెలంగాణలో కాంగ్రెస్ చేతులెత్తేసింది అంటున్నారు రాజకీయ పండితులు. అందుకు గల కారణాలు కూడా వివరిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల నగరా మోగిన తర్వాత రాహుల్ గాంధీ.. రాష్ట్రం వైపు చూడలేదు. కేవలం బస్సు యాత్ర పేరుతో రెండు, మూడు రోజుల పాటు పర్యటించారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద స్పందిస్తూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభుత్వాన్ని విమర్శించబోయి.. తామే ఇరుకునపడ్డారు కాంగ్రెస్ నేతలు. ఈ పర్యటన తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణ వైపు కన్నెత్తి చూడలేదని.. ప్రచారానికి సయమం కేటాయించలేదని గుర్తు చేస్తున్నారు రాజకీయ పండితులు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. రోజుకు రెండు, మూడు చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక బీజేపీ తరఫున అమిత్ షా, నరేంద్ర మోదీ సైతం రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే.. గత పది రోజులుగా రాహుల్ గాంధీ తెలంగాణ వైపు చూడలేదు.. ఇక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అయితే రాహుల్ రాష్ట్రానికి రాకపోవడం వెనక బలమైన కారణమే ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అది ఏంటంటే కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అనుకున్న చోట మాత్రమే రాహుల్ గాంధీ ఎక్కువగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని.. గెలుపు డౌటే అన్న చోట పెద్దగా దృష్టి పెట్టరని.. అందుకే ప్రసుత్తం రాహుల్ గాంధీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఫలితాలపై ఆయనకు క్లారిటీ వచ్చిందిని.. ఓడిపోయే చోట ప్రచారం ఎందుకని భావించే.. తెలంగాణలో ప్రచారానికి రాహుల్ ఆసక్తి చూపడం పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం 2018 లో మాదిరిగా కూడా ఈసారి రాహుల్ ప్రచారంలో పాల్గొనలేదంటున్నారు.
కానీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నాయి. తెలంగాణ కన్నా ముందు రాజస్థాన్‌లో ఎన్నికలు ఉన్నాయి. రాహుల్ అక్కడ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఫుల్ ఫోకస్ తెలంగాణ మీదనే పెడతారని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే నిన్నటితో రాజస్థాన్‌లో ప్రచార అంకం ముగిసింది.
తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాహుల్ కేవలం 25 వ తేదీ ఒక్క పూట (మధ్యాహ్నం తరవాత) ఒక్కసారి మాత్రమే ప్రచారానికి వస్తున్నారని.. అది ఓటమి అంగీకరణ సంకేతం అని విశ్లేషకులు ఘంటా పథంగా చెబుతున్నారు. గతంలో ఓడిపోయే అవకాశం ఉన్న ప్రాంతంలో రాహుల్ ఇలానే తూతూ మంత్రంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సమయంలో.. రాష్ట్రంలో కాంగ్రెకస్ హవా ఉందనే ప్రచారం జోరుగా సాగింది. అలాంటప్పుడు అధిష్టానం దాన్ని మరింత పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. ప్రచార కార్యక్రమాలతో ప్రజల్లోకి బలంగా వెళ్లాలి. స్వయంగా అగ్ర నాయకులే ప్రచార కార్యక్రమాలని పర్యవేక్షించాలి. కానీ రాహుల్ గాంధీ మాత్రం వీటన్నింటికి దూరంగా ఉన్నారు. పైగా ఆయనకు బదులుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక రాష్ట్రంలో పర్యటించారు. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ వారు ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారని.. ప్రజల నుంచి కూడా స్పందన కరువైందని అంటున్నారు రాజకీయ పండితులు.
రాహుల్ గాంధీ 2018 ఎన్నికల సమయంలోనే కాస్త బెటర్.. కానీ ఈసారి ఆమాత్రం కూడా ప్రచారం చేయలేదని.. అంటే ఫలితాలపై ఆయనకు ఓ క్లారిటీ వచ్చేసిందని.. అందుకే పెద్దగా పట్టించుకోవడం లేదని అభిప్రాయపడుతున్నారు. ఇక రాష్ట్ర నేతలు కూడా ప్రచార కార్యక్రమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదని.. అంటే తెలంగాణలో ఓడిపోతామని ఆ పార్టీ నేతలకు కూడా అర్థం అయ్యింది. ప్రస్తుతం వారి తీరు చూస్తే.. పది రోజుల ముందే చేతులు ఎత్తేసినట్లు స్పష్టం అవుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఓడిపోతామని తెలిసే రాహుల్ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.