Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం రాత్రి వరకు 70.60 శాతం పోలింగ్ నమోదయ్యింది. అయితే ఈ ఎన్నికల్లో ఓ ఊరు ఊరంతా ఓటేయలేదు. ఆ వివరాలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం రాత్రి వరకు 70.60 శాతం పోలింగ్ నమోదయ్యింది. అయితే ఈ ఎన్నికల్లో ఓ ఊరు ఊరంతా ఓటేయలేదు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం అయిన పోలింగ్ ప్రక్రియ గురువారం అనగా నవంబర్ 30 న ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త ఘటనలు మినగా.. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రతి సారి లానే పల్లె జనం ఓటేసేందుకు పోటెత్తగా.. పట్నంవాసులు ఎప్పటిలానే బద్దకించి పోయారు. ఇక 2018తో పోలిస్తే ఈ సారి పోలింగ్ కాస్త తగ్గింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం రాత్రి వరకు జరిగిన మొత్తం పోలింగ్ శాతం 70.60గా వెల్లడించారు ఎన్నికల సంఘం అధికారులు. అత్యధికంగా యాదాద్రిలో 90.03శాతం నమోదు కాగా.. హైద్రాబాద్‌లో అత్యల్పంగా 46.56 శాతం నమోదైంది. ఇదిలా ఉండగా ఓ ఆసక్తికర సంఘటన వెలుగు చూసింది. ఓ ఊరైతే మొత్తానికే ఓటేయ్యలేదు. ఆ వివరాలు..
ఆదిలాబాద్ జిల్లా బీంపూర్ మండలంలోని గొల్లగడ్ గ్రామస్తులు ఈసారి పూర్తిగా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. గ్రామంలో ఉన్న ఒక్కరు కూడా పోలింగ్ బూతుకు వెళ్లి ఓటెయ్యలేదు. పోలింగ్ సమయం ముగిసేవరకు ఎదురుచూసినా.. ఒక్కరూ రాకపోవటంతో.. ఎన్నికల అధికారులు ఖాళీగానే వెనుదిరగాల్సి వచ్చింది. అయితే బీంపూర్ గ్రామస్తులు ఓటేయ్యకపోవడానికిక బలమైన కారణమే ఉంది. ఇప్పటి వరకు వచ్చిన నేతలంతా హామీలు ఇవ్వడం తప్ప ఒక్కరు కూడా తమ గ్రామాన్ని పట్టించుకోలేదని.. తమ ఊరికి ఏమి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల తీరుకు నిరసనగా.. ఈ సారి ఓటేయ్యలేదు.
ఈరాజకీయ నేతలపై తమకు ఎలాంటి నమ్మకం లేదని గ్రామస్తులు తెగేసి చెప్తున్నారు. అందుకే ఎవరికీ ఓటు వేయలేదని వెల్లడిస్తున్నారు. అంతేకాక కలెక్టర్ వచ్చి.. తమ సమస్యలు విని పరిష్కారానికి హామీ ఇస్తే.. అప్పడు ఓటు వేస్తామని స్పష్టం చేశారు. అయితే పోలింగ్ జరుగుతుండటంతో.. కలెక్టర్ బీంపూర్ గ్రామానికి వెళ్లడానికి అవకాశం కుదరలేదు. దాంతో ఆయన ఫోన్‌లో మాట్లాడి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ గ్రామస్తులు నమ్మలేదు. దాంతో వారు ఓటు వేయటానికి ఆసక్తి చూపకుండా.. ఎన్నికలను బహిష్కరించారు.
బీంపూర్ మండలంలోని థాంసీ గ్రామం నుంచి వేరుపడి గొల్లగడ్ కొత్త గ్రామ పంచాయతిగా ఏర్పాడింది. బీంపూర్ మండలంలో మొత్తం 26 గ్రామాలుండగా.. అన్ని ఊళ్లలో కలిపి 80 శాతం ఓటింగ్ దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. మండలంలోని మిగతా గ్రామాలన్ని ఓటు వేయగా.. గొల్లగడ్ మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉండటం గమనార్హం. మరి ఆదిలాబాద్ జిల్లాలో ఏ పార్టీ ఆధిక్యం కనబరుస్తుందో.. గెలిచే అభ్యర్ధులు ఎవరో తెలియాలంటే 2 రోజులు ఆగాలి.