Tirupathi Rao
TDP Leader Son Arrested: టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను పోలీసులు అరెస్టు చేశారు. మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
TDP Leader Son Arrested: టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను పోలీసులు అరెస్టు చేశారు. మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Tirupathi Rao
టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కు షాక్ తగిలింది. ఆయన కుమారుడు శరత్ ను కృష్ణా జిల్లా మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. శరత్ ను జీఎస్టీ ఎగవేతల ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. శరత్ ఆవేక్సా కార్పొరేషన్ అనే కంపెనీ నడుపుతున్నారు. ఆ కంపెనీకి సంబంధించిన జీఎస్టీ ఎగవేత ఆరోపణలతోనే శరత్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. జీఎస్టీ అధికారుల ఫిర్యాదుతో విచారణ జరిపిన పోలీసులు శరత్ ను అరెస్టు చేశారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఇటీవల టీడీపీ కూటమి ప్రకటించిన అభ్యర్థుల్లో చిలకలూరిపేట సీటు దక్కించుకున్న ప్రత్తిపాటి పుల్లారావుకు షాక్ తగిలింది. ఆయన కుమారుడిని జీఎస్టీ ఎగవేత ఆరోపణలతో మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టును స్థానిక టీడీపీ నేతలు ఖండించారు. అయితే జీఎస్టీ అధికారుల ఫిర్యాదుతోనే పోలీసులు ఈ అరెస్టు చేసినట్లు చెప్తున్నారు. ఒక సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుమారుడు ఇలాంటి కేసులో అరెస్టు కావడంపై రాజకీయ విశ్లేషకులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ అరెస్టును పుల్లారావు కూడా ఖండించారు. ఆ కంపెనీలో అసలు తన కుమారుడు డైరెక్టర్ కూడా కాదంటూ బుకాయించారు.
ఇంక ప్రత్తిపాటి పుల్లారావు వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సీటు దక్కించుకున్నారు. 2019లో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఓటమి తర్వాత రాజకీయాలకు కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. ఇంక రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారేమో అనుకునే తరుణంలో మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చారు. ప్రవీణ్ అనే మరో టీడీపీ నేత చురుగ్గా ఉన్నాడని అసంతృప్తి కూడా వ్యక్తం చేసేవారంట. అసలు ప్రవీణ్ అనే వ్యక్తి చిలకలూరిపేటలో తిరగకూడదు అంటూ ఒత్తిడి కూడా తెచ్చారంటూ ఆరోపణలు వచ్చాయి. చివరకు పట్టుబట్టి చిలకలూరిపేట టికెట్ కు కూడా దక్కించుకున్నారు. స్థానికంగా అసలే ప్రజా మద్దతు లేకపోవడం, ఇన్నాళ్లు ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండటం మైనస్ గా బావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో శరత్ అరెస్టు కావడం చూస్తే.. పుల్లారావు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయ్యిందంటూ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి.. పుల్లారావు కుమారుడు అరెస్టు కావడంపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.