iDreamPost
android-app
ios-app

Sarpanch Navya: సర్పంచ్ నవ్య- ఎమ్మెల్యే రాజయ్య కేసు.. చివర్లో భారీ ట్విస్ట్!

Sarpanch Navya: సర్పంచ్ నవ్య- ఎమ్మెల్యే రాజయ్య కేసు.. చివర్లో భారీ ట్విస్ట్!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్పంచ్ నవ్య- ఎమ్మెల్యే రాజయ్య కేసు ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలుసు. ఎమ్మెల్యే తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ సర్పంచ్ నవ్య ఆరోపణలు చేయడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎమ్మెల్యే రాజయ్య అయితే ప్రెస్ మీట్ పెట్టి మరీ మహిళలకు బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు. పదే పదే తనను వేధింపులకు గురి చేస్తున్నారని.. తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ నవ్య చెప్పుకొచ్చారు.

ఈ విషయంలో మహిళా కమీషన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. విచారణ చేసి నిజానిజాలు వెల్లడించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మహిళా కమిషన్, పోలీసుల చొరవతో ఈ కేసుకు తెర పడింది. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే.. పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ సర్పంచ్ నవ్య ఎలాంటి ఆధారాలను సమర్పించలేదు. ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలు అంటూ పోలీసులు కూడా కేసు క్లోజ్ చేశారు. నిర్ణీత సమయానికి ఆధారాలు సమర్పించలేదని కేసును పోలీసులు క్లోజ్ చేశారు. అదే విషయాన్ని మహిళా కమిషన్ కు కూడా తెలియజేశారు.

అసలు సర్పంచ్ ఏమని ఆరోపణలు చేశారంటే.. ఎమ్మెల్యే తనని లైంగికంగా వేధిస్తున్నారని, గ్రామాభివృద్ధి కోసం రూ.25 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు ఆరోపించారు. ఆ డబ్బుని తమ వద్ద రాబట్టేందుకు తన భర్తపై ఒత్తిడి తెస్తున్నారని.. ఆరోపణలు అన్నీ రాజకీయ లబ్ధి కోసమే అంటూ సంతకాలు కూడా చేయించేందుకు ఒత్తిడి తెచ్చినట్లు నవ్య ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్లు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలోనే కాజీపేట ఏసీపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ, ఆ నోటీసులకు నవ్య స్పందించలేదని తెలిపారు. మరోవైపు మొదటి నుంచి ఎమ్మెల్యే రాజయ్య సర్పంచ్ నవ్య ఆరోపణలు కండిస్తూనే ఉన్నారు.