Tirupathi Rao
Rayapati Ranga Rao Resigned: తెలుగు దేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీలోని సీనియర్లు ఒక్కొక్కరిగా రాజీనామాలు చేస్తున్నారు.
Rayapati Ranga Rao Resigned: తెలుగు దేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీలోని సీనియర్లు ఒక్కొక్కరిగా రాజీనామాలు చేస్తున్నారు.
Tirupathi Rao
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం రక్తి కడుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత రాయపాటి రంగారావు పార్టీకి రాజీనామా చేశారు. ఆ సందర్భంగా పార్టీపై, చంద్రబాబు- లోకేశ్ పై విమర్శలు గుప్పించారు. టీడీపీ ఒక దిక్కుమాలిన పార్టీ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. తన కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫొటోని రాయపాటి రంగారావు నేలకేసి కొట్టారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు, దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత రాయపాటి రంగారావు పార్టీకి, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్టుకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపారు. తాను ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఇమడలేనని వ్యాఖ్యానించారు. తన రాజీనామాని ఆమోదించాలని కోరారు. ఈ సందర్భంగా రాయపాటి రంగారావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. టీడీపీ ఒక దిక్కుమాలిన పార్టీ అంటూ మండిపడ్డారు. అసలు అది పార్టీ కూడా కాదు వ్యాపార సంస్థ అంటూ దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో తమ నుంచి రూ.150 కోట్లు తీసుకున్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ ఎంతెంత తీసుకున్నారో తన వద్ద లెక్కలున్నాయన్నారు.
అసలు లోకేశ్ మంగళగిరి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. రాయలసీమలో పోటీ చేయచ్చు కదా.. అక్కడ మీకు మనుషులు లేరా అంటూ చురకలు అంటించారు. అసలు ఆయన ఇల్లు ఎక్కడుందని ప్రశ్నించారు. మంగళగిరిలో లోకేశ్ ఓడించి తీరుతానని రాయపాటి రంగారావు సవాలు చేశారు. రాయలసీమకు అంత చేశాం, ఉద్యోగాలు తెచ్చామని చెప్తారు కదా.. మరి ఎందుకు అక్కడ 3 సీట్లే గెలిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీసిటీ తామే కట్టామని చెప్పే వారిని ఎందుకు ప్రజలు ఆదరించడంలేదని సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ రాజీనామా విషయాన్ని వెల్లడించే సమయంలో రాయపాటి రంగారావు.. ఆయన కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫొటోని నేలకేసి కొట్టారు. ఆ సందర్భంలో కోపంతో ఊగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తెలుగుదేశం పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కో సీనియర్ నేత పార్టీని వీడుతున్నారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన రెండు కుటుంబాలు ఇప్పుడు ఆ పార్టీని వీడాయి. మొన్న విజయవాడ ఎంపీ కేశినేని పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. తాజాగా రాయపాటి రంగారావు ఆ పార్టీని వీడారు. ఇదే రోజు టీడీపీ సీనియర్ నాయకులు లింగనేని శివరామ ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా తన రాజీనామాని ప్రకటించిన విషయం తెలిసిందే. టీడీపీ వైఖరి, విధానాలు నచ్చకే సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. సీనియర్ నేతలు టీడీపీకి రాజీనామా చేస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
కోపంతో చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు
టీడీపీకి రాజీనామా చేసిన సందర్భంగా కోపంతో తన ఆఫీసులో ఉన్న చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టి ‘లోకేశ్ మంగళగిరిలో ఎలా గెలుస్తాడో చూస్తా’ అంటూ సవాలు విసిరిన రాయపాటి రంగారావు.
ఎన్నికల్లో… pic.twitter.com/6eLjs7GtPJ
— Telugu Scribe (@TeluguScribe) January 12, 2024