iDreamPost
android-app
ios-app

వీడియో: ఎన్నికల సిత్రం.. నీ కాళ్లు మొక్కుతా.. నాకు మద్దతివ్వు

  • Published Nov 03, 2023 | 11:45 AM Updated Updated Nov 03, 2023 | 11:45 AM

ఎన్నికల్లో గెలవడం కోసం అభ్యర్థులు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల వేషాలు వేస్తారు. ఆఖరికి వాళ్ల కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధం అవుతారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆ వివరాలు..

ఎన్నికల్లో గెలవడం కోసం అభ్యర్థులు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల వేషాలు వేస్తారు. ఆఖరికి వాళ్ల కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధం అవుతారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆ వివరాలు..

  • Published Nov 03, 2023 | 11:45 AMUpdated Nov 03, 2023 | 11:45 AM
వీడియో: ఎన్నికల సిత్రం.. నీ కాళ్లు మొక్కుతా.. నాకు మద్దతివ్వు

ఎన్నికల వేళ కనిపించే సిత్రాల ముందు ఏ సినిమా కూడా పనికి రాదు. ఎలక్షన్స్‌లో విజయం సాధించడం కోసం ఎలాంటి పనులు చేయడానికైనా వెనకాడరు. ఆఖరికి ఓట్ల కోసం కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధ పడతారు. ఒక్కసారి గెలిచారంటే.. ఆ తర్వాత జనాల నెత్తినెక్కి ఆడతారు. ఇక ఎన్నికల్లో తమకు మద్దుతు ఇవ్వాలంటూ రెబల్స్‌ని కూడా బతిమిలాడుకుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలంటూ ఓ అభ్యర్థి.. ఎమ్మెల్యే కాళ్లు పట్టుకుని మరి బ్రతిమిలాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

ప్రస్తుతం తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజస్తాన్‌లో టికెట్ల కేటాయింపు.. కాంగ్రెస్‌ పార్టీలో ముసలం పుట్టించే దిశగా సాగుతోంది. గతంలో సచిన్‌ పైలట్‌ వెంట ఉన్న రెబల్స్‌లో కొందరికి ఈ సారి టికెట్‌ నిరాకరించారు. దాంతో వాళ్ల అనుచరులు ఆందోళనకు దిగారు. ఇక టికెట్‌ దక్కని వారిలో రాజ్‌గఢ్‌-లక్ష్మణ్‌గఢ్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే జోహారీలాల్‌ మీనా కూడా ఉన్నారు. అధిష్టానం ఆయనను కాదని.. కొద్ది రోజుల క్రితం పార్టీలో చేరిన రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి మంగీలాల్‌ మీనాకు టికెట్‌ కేటాయించింది. అయితే మరో అభ్యర్థి రాహుల్‌ మీనా కూడా టికెట్‌ ఆశించి భంగపడ్డారు.

ఈ క్రమంలో రాహుల్‌.. రాజ్‌గఢ్‌లో కార్యకర్తలతో సమావేశం అయ్యి.. తన ఆవేదన వెలిబుచ్చారు. టికెట్‌ కేటాయించకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సమావేశం కొనసాగుతున్న సమయంలోనే అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే క్యాండెట్‌ మంగీలాల్‌.. తనకు అండగా నిలవాలంటూ రాహుల్‌ని అభ్యర్థించాడు. మోకాళ్లపై కూర్చుని.. వేడుకున్నాడు. ఒక సోదరుడిలా భావించి.. తనకు మద్దతివ్వాలంటూ రాహుల్‌ కాళ్లు కూడా పట్టుకోబోయాడు మంగీలాల్‌. అది గమనించిన రాహుల్‌.. మంగీలాల్‌ను అడ్డుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతుంది.