iDreamPost
android-app
ios-app

వృద్ధురాలి హత్యపై తప్పుడు ప్రచారం మొదలెట్టిన పవన్ కల్యాణ్!

వృద్ధురాలి హత్యపై తప్పుడు ప్రచారం మొదలెట్టిన పవన్ కల్యాణ్!

వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ మరోసారి నోరు పారేసుకున్నారు. గతంలో వాలంటీర్ వ్యవస్థపై దుష్ర్పచారం చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మరోసారి అదే వైఖరి ప్రదర్శించారు. ఈసారి పవన్ కల్యాణ్ శవ రాజకీయాలకు తెరలేపారంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు మండి పడుతున్నారు. విశాఖలో హత్యకు గురైన వృద్ధురాలి మరణాన్ని తన రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నారు అంటూ పవన్ కల్యాణ్ పై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కావాలనే ప్రభుత్వంపై బురుద జల్లేందుకు ఇలాచేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.

విశాఖలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించే పేరుతో పవన్ కల్యాణ్ శవ రాజకీయాలు షురూ చేశారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. వరలక్ష్మీ అనే వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేశాడంటూ తప్పుడు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. రాజకీయ లబ్ధి కోసం మాత్రమే విశాఖలో వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారంటూ కామెంట్ చేస్తున్నారు. తాజాగా వాలంటీర్లను కుత్తుకలు కోసే దండుపాళ్యం బ్యాచ్ తో పోల్చడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు పవన్ చేస్తున్న తప్పుడు ప్రచారం ఏంటంటే.. వరలక్ష్మిని హత్య చేయడానికి వారం ముందే వెంకటేష్ అనే యువకుడిని వాలంటీర్ పోస్టు నుంచి తొలగించారు.

అతను విధులకు సరిగ్గా హాజరు కావడంలేదని ఫిర్యాదు రావడంతో అతడిని జులై 24న ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాతే వరలక్ష్మీకి చెందిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వెంకటేశ్ పనికి కుదిరాడు. జులై 30న నగల కోసం వరలక్ష్మిని హత్య చేశాడు. ఇదంతా అందరికీ తెలిసిన తర్వాత కూడా పవన్ కల్యాణ్.. వాలంటీర్ హత్య చేశాడు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు ఇంట్లో పనిచేసే వ్యక్తి చంపేస్తే.. వాలంటీర్ హత్య చేసినట్లు ఎలా అవుతుంది అంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి విష ప్రచారాన్ని ఆపాలంటూ సూచిస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఎంత బాబు డైరెక్ట్ చేస్తే మాత్రం.. మరీ ఇంతగా దిగజారాలా అంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ వాలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్ తో పోల్చడాన్ని కూడా తప్పుబడుతున్నారు. పవన్ ఇలాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.