అవును జగన్ తప్పు చేశాడు! రాజకీయాల్లో ఇంత నిజాయతి తప్పే!

అవును జగన్ తప్పు చేశాడు! రాజకీయాల్లో ఇంత నిజాయతి తప్పే!

యార్లగడ్డ వెంకట్రావ్‌ వైఎస్సార్‌సీపీ పార్టీని విడిన సంగతి తెలిసిందే. పార్టీని విడుతూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీలో తనను అవమానించారని.. ఇక వైసీపీలో కొనసాగలేనని.. పైగా సజ్జల తనను పోతే పో అని దారుణంగా అవమానించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన యార్లగడ్డ.. మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ తరఫున తనకు అవకాశం ఇస్తే.. గన్నవరంలో గెలుస్తానని వ్యాఖ్యానించి.. టీడీపీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. ఇక యార్లగడ్డ నిర్ణయంపై ఆయన అనుచరలే ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. కేవలం ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వనంత మాత్రనా.. ఇన్నాళ్లు అక్కున చేర్చుకున్న పార్టీని.. అండగా నిలిచిన జగన్‌ని ఇలా అవమానించడం కరెక్ట్‌ కాదు అంటున్నారు జనాలు.

అసలు మీకు ఏం అన్యాయం జరిగిందని.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.. తల్లి లాంటి పార్టీ మీద, సీఎం మీద ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు జనాలు. రాజకీయాల్లో ఏ నాయకుడైనా గెలిచే వాళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడు. పార్టీ కోసం ప్రాణాలిచ్చే వారైనా సరే.. ఎన్నికల్లో వారు గెలిస్తినే అధిష్టానం దగ్గర తీస్తుంది. కానీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అలా కాదు. ఆయన వైఖరే భిన్నంగా ఉంటుంది అని గుర్తు చేసుకుంటున్నారు జనాలు.

రాజకీయాలు, గెలుపోటముల కన్నా.. పార్టీ, నాయకులతో మంచి సంబంధాలు, వారితో అనుబంధం ముఖ్యం అనుకుంటారు జగన్‌. అందుకే కదా.. 2019లో ఓడిపోయిన నేతలందరికి.. పదవులు ఇచ్చి ఆదరించారు. పార్టీని నమ్ముకుని ఉన్న ఏ ఒక్కరికి జగన్‌ అన్యాయం చేయలేదు. 2019 ఎన్నికల ముందు పార్టీలో చేరి పోటీ చేసిన ఒకరిద్దరికి మినహా అందరికీ ఎమ్మెల్యే స్థాయి పదవులు ఇచ్చారు జగన్‌. అదే టీడీపీలో చూసుకుంటే.. 2014 ఎన్నికలలో తెలుగుదేశం నుండి ఓడిపోయిన వారిలో సోమిరెడ్డి కి మినహా ఎవరికీ ఏమీ ఇవ్వలేదు .

వైసీపీలో ఎవరెవరికి ఏమేమీ ఇచ్చారంటే.

  1. యార్లగడ్డ వెంకటరావు అంటే మీకు కృష్ణా జిల్లా డీసీసీబీ ప్రెసిడెంట్‌ పదవి ఇచ్చారు.
  2. ఆమంచి కృష్ణ మోహన్‌కి ఎమ్మెల్సీ ఇస్తాను అంటే ఆయన తన వర్గం త్రిమూర్తులుకి ఇవ్వండి అన్నారు.
  3. చంద్రగిరి ఏసురత్నం ఎమ్మెల్సీ.. అంతకు ముందు మార్కెట్ యార్డ్ పదవి కట్టబెట్టారు.
  4. మోపిదేవికి అయితే ఎమ్మెల్సీ , మంత్రి , ఇప్పుడు రాజ్యసభ
  5. పిల్లి సుభాష్‌కి ఎమ్మెల్సీ, ఉపముఖ్యమంత్రి, రాజ్యసభ
  6. బొంతు రాజేశ్వర రావుకి ఆర్‌డబ్ల్యూఎస్‌ ఛైర్మన్ పదవి ఇచ్చారు. కానీ ఆయన అది మర్చిపోయి జనసేన లోకి వెళ్లారు
  7. షర్మిలా రెడ్డి .. రుడా ఛైర్మన్‌ పదవి ఇచ్చారు.
  8. చందన నాగేశ్వర రావుకి గ్రీనింగ్‌, బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమించారు
  9. పేరాడ తిలక్‌కి కళింగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి
  10. ద్రోణంరాజు శ్రీనివాస్ వీఎంఆర్‌డీఏ ఛైర్మన్
  11. అక్కరమని విజయనిర్మల సిరిపురం వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌
  12. కేకే రాజు, ఎన్‌ఈడీసీఏపీ ఛైర్మన్‌
  13. ఆకుల వీర్రాజు డీసీసీబీ ఈస్ట్‌
  14. నరసింహరాజు డీసీసీబీ వెస్ట్‌
  15. గరటయ్య .. ఆయన కుమారుడికి సాప్‌నెట్‌ ఛైర్మన్
  16. ఇక్బాల్ .. రెండు సార్లు ఎమ్మెల్సీ
  17. కుప్పం చంద్రమౌళి చనిపోతే కుమారుడికి ఎమ్మెల్సీ
  18. మాదాసు వెంకయ్య .. డీసీసీబి ప్రకాశం
  19. దువ్వడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ

ఇలా తనను నమ్ముకుని.. ముందు నుంచి ఉన్న అందరికీ జగన్‌ న్యాయం చేశారు. బహుశా రాజకీయాల్లో ఇంత నిజాయతీగా ఉండటమే ఆయన చేసిన తప్పేమో. అందుకే మీరంతా తిన్నింటి వాసాలు లెక్కెపెడుతున్నారు అని చర్చించుకుంటున్నారు జనాలు. పార్టీలో మీకేదో అవమానం జరిగింది.. అందుకే వెళ్లిపోతున్నాము అంటున్నారు. పైగా పార్టీ గురించి, అధినేతపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఒక్కటి గుర్తు పెట్టుకొండి.. జనాలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మీలాంటి నమ్మకద్రోహులకి సరైన విధంగా బుద్ధి చెబుతారు అంటున్నారు ఏపీ ప్రజలు.

Show comments