Tirupathi Rao
సైబర్ టవర్స్ నిర్మించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన బండ్ల గణేశ్ స్పీచ్ కూడా ఇచ్చారు.
సైబర్ టవర్స్ నిర్మించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన బండ్ల గణేశ్ స్పీచ్ కూడా ఇచ్చారు.
Tirupathi Rao
రెండు తెలుగు రాష్ట్రాల్లో బండ్ల గణేశ్ పేరు తెలియని సినిమా ప్రేక్షకులు ఉండరనే చెప్పాలి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి.. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ హోదాలో కొనసాగుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలి అనుకునేవారికి ఈయన ఒక ఇన్ స్పిరేషన్ అనే చెప్పాలి. పైగా మనసులో ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది ప్రస్తుతం బండ్ల గణేశ్ పై నెట్టింట విమర్శలు, సెటైర్లు పేలుతున్నాయి. బండ్ల గణేశ్ కు ఈ మాత్రం తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఆర్టిస్టుగా చేసినా.. నిర్మాతగా ఎదిగినా కూడా ఎంతో సింపుల్ గా ఉండే వ్యక్తి బండ్ల గణేశ్. అటు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ పై తన అభిప్రాయాలను వినిపిస్తూ ఉంటారు. సందర్భం ఏదైనా కూడా ఆయన ఇచ్చే స్పీచులకు ఒక సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంటుందనే చెప్పాలి. అలాంటి బండ్ల గణేశ్ చేసిన ఒక స్పీచ్ ఇప్పుడు నెట్టింట విమర్శలకు తావిస్తోంది. సెలబ్రేటింగ్ 25 ఇయర్స్ అఫ్ సైబర్ టవర్స్ అనే కార్యక్రమంలో బండ్ల గణేశ్ పాల్గొన్నారు. స్టేజ్ మీద స్పీచ్ కూడా ఇచ్చారు. ఆ స్పీచులో తన తండ్రి తనను చంద్రబాబు అరెస్టు గురించి ప్రశ్నించినట్లు చెప్పారు. “నా తండ్రికి 78 సంవత్సరాలు. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేశారు అంటూ నన్ను ప్రశ్నించారు” అని చెప్పుకొచ్చారు.
తండ్ర ప్రశ్నకు బండ్ల గణేశ్ చెప్పిన సమాధానం.. “హైదరాబాద్ కట్టిన కులీ కుతుబ్ షా గురించి 400 ఏళ్లు చెప్పుకున్నారు కదా.. సైబరాబాద్ కట్టిన చంద్రబాబు గురించి కూడా 400 ఏళ్లు చెప్పుకోవాలిగా.. శ్రీకృష్ణుడి జన్మస్థానం ఏంటో తెలుసు. ఆయన దేవుడు కాకుండా పోయాడా? అరణ్యవాసానికి వెళ్లిన రాముడు దేవుడు కాకుండా పోయాడా? 40 రోజులు జైల్లో ఉంటే చంద్రబాబు దేవుడు కాకుండా పోతాడా?” అంటూ బండ్ల గణేశ్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీదే నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి. మీ తండ్రి అంటే పెద్దాయన.. 78 సంవత్సరాల వయసులో బయట ఏం జరుగుతుందో తెలియక అడిగి ఉంటారు. మరి మీకు స్కిల్ స్కామ్ అంటే తెలియదా? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఒకటి జరిగిందని జీఎస్టీ అధికారుల దృష్టికి వచ్చింది.
ఆ స్కామ్ కు సంబంధించి అధికారులు చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు రిమాండు ఖైదీగా ఉన్నారు. ఆయన ఎలాంటి తప్పు చేయకపోతే నిర్దోషిగా బయటకు వస్తారు. ఇంత సింపుల్ గా ఉంటే ఇది చెప్పకుండా.. చంద్రబాబు రాముడు, కృష్ణుడు, దేవుడు అని చెప్పడం ఏంటంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు బండ్ల గణేశ్ కు స్కిల్ స్కామ్ గురించి తెలుసా అంటూ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు జైలులో ఉంటే వినాయక చవితి, దసరా జరుపుకోకపోవడం ఏంటంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి.. బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.