iDreamPost
android-app
ios-app

Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్‌పై కేసు నమోదు.. కారణమిదే

  • Published May 03, 2024 | 7:54 AM Updated Updated May 03, 2024 | 7:54 AM

నిర్మాత బండ్ల గణేష్‌ అనగానే వివాదాలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా మారి పోయారు. చెక్‌ బౌన్స్‌ కేసులో ఏడాది జైలు శిక్ష ఎదుర్కొంటున్న బండ్ల గణేష్‌ మీద మరో కేసు నమదయ్యింది. ఆ వివరాలు..

నిర్మాత బండ్ల గణేష్‌ అనగానే వివాదాలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా మారి పోయారు. చెక్‌ బౌన్స్‌ కేసులో ఏడాది జైలు శిక్ష ఎదుర్కొంటున్న బండ్ల గణేష్‌ మీద మరో కేసు నమదయ్యింది. ఆ వివరాలు..

  • Published May 03, 2024 | 7:54 AMUpdated May 03, 2024 | 7:54 AM
Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్‌పై కేసు నమోదు.. కారణమిదే

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి. అంచెలంచెలుగా ఎదుగుతూ.. నేడు నిర్మాతగా మారాడు బండ్ల గణేష్‌. రాజకీయాల్లో కూడా యాక్టీవ్‌గానే ఉంటున్నాడు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నాడు. ఇక బండ్ల గణేష్‌ అనగానే వివాదాలు, కేసులే గుర్తుకు వస్తాయి. ఇక రాజకీయాలకు సంబంధించి మాత్రమే కాక.. సినిమా ఇండస్ట్రీ పరంగా కూడా నిత్యం ఏదో వివాదంలో చిక్కుకోవడం బండ్ల గణేష్‌కు అలవాటే. ఇక తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు ఈ ప్రొడ్యూసర్‌. ఆయనపై కేసు నమోదయ్యింది. ఎందుకు.. కారణం ఏంటి.. అంటే..

బండ్ల గణేష్‌ మీద కేసు నమోదయ్యింది. ఇంటి ఓనర్‌ ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో నివాసం ఉంటున్న బండ్ల గణేష్‌ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ.. ఫోర్జరీ డాక్యుమెంట్‌తో ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ.. హీరా గ్రూప్‌ చైర్మన్‌ నౌహీరా షేక్‌ ఆయన మీద పోలీసులకు షిర్యాదు చేశారు. ఫిలింనగర్‌లో పోలీస్‌ స్టేషన్‌లో ఆయన మీద కేసు నమోదయ్యింది. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నౌహీరా షేక్‌ ఫిలింనగర్‌ ఇంటిని నిర్మాత బండ్ల గణేష్‌కు అద్దెకు ఇచ్చింది. నెలకు లక్ష రూపాయలు రెంట్‌ చెల్లిస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా బండ్ల గణేష్‌ తనకు అద్దె ఇవ్వకపోవడమే కాక.. బెదిరిస్తున్నారని.. తనను ఇంట్లోకి కూడా అనుమతించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని నౌహీరా షేక్‌ ఆరోపించింది.

తాను అద్దె అడిగితే.. నిర్మాత బండ్ల గణేష్‌ తనను గుండాలతో బెదిరిస్తున్నాడని.. పైగా తన ఇంట్లో అద్దెకుంటూ.. అసాంఘిక కా​ర్యకలపాలకు పాల్పడుతున్నట్లు నౌహీరా షేక్‌ ఆరోపించింది. గుండాల సాయంతో.. రాజకీయ నాయకుల అండతో బండ్ల గణేష్‌ తన ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చింది. నౌహీరా షేక్‌ ఫిర్యాదు మేరకు ఫిలింనగర్‌ పోలీసులు బండ్ల గణేష్‌ మీద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నౌహీరా మీద బండ్ల గణేష్‌ కుమారుడు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక గతంలో చెక్‌ బౌన్స్‌ కేసులో బండ్ల గణేష్‌కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. మరి ఈ తాజా వివాదంపై బండ్ల గణేష్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişdinamobet girişgrandpashabet