iDreamPost
android-app
ios-app

Bandla Ganesh: రెచ్చిపోయిన బండ్ల గణేష్! మహిళను బూతులు తిడుతూ..

  • Published Feb 18, 2024 | 3:24 PM Updated Updated Feb 18, 2024 | 3:24 PM

సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా తన కెరీర్ ను ప్రారంభించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా ఎదిగారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. అయితే తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంటారు.

సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా తన కెరీర్ ను ప్రారంభించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా ఎదిగారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. అయితే తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంటారు.

  • Published Feb 18, 2024 | 3:24 PMUpdated Feb 18, 2024 | 3:24 PM
Bandla Ganesh: రెచ్చిపోయిన బండ్ల గణేష్! మహిళను బూతులు తిడుతూ..

సినీ, రాజకీయాల రంగాలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పలు వివాదలతో కొందరు సినీ ప్రముఖులు వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి వారిలో బండ్ల గణేష్ ఒకరు. ఈయన గురించి రెండు తెలుగు రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాలు, రాజకీయాలు కంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా బండ్ల గణేష్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఆయన ఎక్కడ ఏం మాట్లాడిన వైరల్ అవుతునే ఉంటుంది. ఈవెంట్, ఇంటర్యూ ఏదైనా ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు.  తాజాగా బండ్ల గణేష్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టాలీవుడ్ అనేక సినిమాలకు ప్రోడ్యూసర్ గా వ్యవహరించి బండ్ల గణేష్ మంచి గుర్తింపు పొందారు. అలానే ప్రోడ్యూసర్ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం కాంగ్రెస్ నేతగా ప్రజలలో గుర్తింపు పొందారు. అయితే ఇటీవల కాలంలో బండ్ల గణేష్ టైం అస్సలు బాగోలేదని చెప్పాలి. ఆయన ఏది చేసిన, ఏం మాట్లాడిన అది బ్లాస్టింగ్ రేంజ్ లో రివర్స్ అవుతోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఆయన బూతులు మాట్లాడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసేంది. తన ఆఫీసుకు వచ్చిన ముస్లిం దంపతులతో ఏదో మాట్లాడుతున్నట్లు కనిపించారు .అయితే పక్కనే ఉన్న బండ్ల గణేష్ మాట్లాడుతూ ఉండగా మరోవైపు తన అనుచరుడు ఘర్షణ పడుతున్న ఘటన వీడియోల గమనించ వచ్చు.

చివరికి బండ్ల గణేష్ కూడా ఆగ్రహంతో “అమ్మని….” అంటూ ఆ భార్యాభర్తలను బూతులు తిట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదంతా ఓ ఇంటి స్థలంకు సంబంధించి అని వీడియో ఆధారంగా తెలుస్తుంది. అయితచే ఈ ఘటనపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ వీడియోపై పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది బండ్ల అన్న రౌడీయిజం అని ఒకరంటే, మహిళలపై దౌర్జన్యం చేయడం దేనికి సంకేతమని మరికొందరు అంటున్నారు. తక్షణమే ఆ మహిళకు న్యాయం చేయాలంటూ పలువురు నెటిజన్లు డిమాండ్ చేశారు. మొత్తంగా ఈ ఘటనతో బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet