iDreamPost
android-app
ios-app

బీఆర్ఎస్ లోకి సంగారెడ్డి ఎమ్మెల్యే! క్లారిటీ ఇచ్చిన జగ్గారెడ్డి

బీఆర్ఎస్ లోకి సంగారెడ్డి ఎమ్మెల్యే! క్లారిటీ ఇచ్చిన జగ్గారెడ్డి

తెలంగాణలో మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీల్లోని కీలక నేతలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పార్టీలు మారుతున్నారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్న ఖమ్మం కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఇక ఆయన చేరిన కొన్ని రోజులకే జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక మరికొందరు నేతలు బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో చేరుతున్నారు.

అయితే ఈ క్రమంలోనే సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ముహుర్తం కూడా ఖరారైందని, త్వరలోనే ఆయన గులాబీ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇకపోతే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సొంత పార్టీ నేతల తీరుపై కాస్త అసహనంగా ఉన్నారని, వీరి ప్రవర్తన కారణంగానే ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్లనున్నారనే ప్రచారం నడుస్తోంది. అయితే జగ్గారెడ్డిపై ఇలాంటి ప్రచారం కొత్తేమి కాదు. గతంలో చాలా సార్లు ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం నడిచింది. దీనికి ఆయన వెంటనే స్పందించి ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చిన సందర్భాలు లేకపోలేదు.

కాగా మరోసారి పార్టీ మారుతున్నారని ప్రచారం జరగుతుండడంతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా స్పందించినట్లుగా తెలుస్తుంది. నేను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నానంటూ వస్తున్న వార్తలు నిరాధారమైనవని, ఎవరో కావాలని ఇలా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారంటూ జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ నేను పార్టీ మారాల్సి వస్తే అందరికీ చెప్పే మారతాను. ఎలాంటి డెసిషన్ తీసుకున్న ధైర్యంగా అందరితో మాట్లాడే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అసలు నాపై ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. జగ్గారెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతూ తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్‌ క్రేజ్‌ అంటే ఇది.. BRSలో మరో పార్టీ విలీనం