iDreamPost
android-app
ios-app

మేము కొట్టే దెబ్బకు మైనంపల్లి షేక్‌ అవ్వాల్సిందే: మర్రి రాజశేఖర్‌రెడ్డి

  • Published Nov 01, 2023 | 2:20 PM Updated Updated Nov 01, 2023 | 2:40 PM

గ్రేటర్‌ పరిధిలోనే అతి పెద్ద నియోజకవర్గం మల్కాజ్‌గిరి. ప్రస్తుతం ఇక్కడ హోరాహోరి అనే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ బీఆర్‌ఎస్‌ తరఫున మర్రి రాజశేఖర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి గురించి ఆయన మాటల్లోనే..

గ్రేటర్‌ పరిధిలోనే అతి పెద్ద నియోజకవర్గం మల్కాజ్‌గిరి. ప్రస్తుతం ఇక్కడ హోరాహోరి అనే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ బీఆర్‌ఎస్‌ తరఫున మర్రి రాజశేఖర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి గురించి ఆయన మాటల్లోనే..

  • Published Nov 01, 2023 | 2:20 PMUpdated Nov 01, 2023 | 2:40 PM
మేము కొట్టే దెబ్బకు మైనంపల్లి షేక్‌ అవ్వాల్సిందే: మర్రి రాజశేఖర్‌రెడ్డి

ప్రస్తుతం తెలంగాణ రాజకీయం అంతా మల్కాజ్‌గిరి చుట్టే తిరుగుతోంది. హైదరాబాద్‌లో ఇదే అతి పెద్ద నియోజకవర్గం. పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తిరుగుబాటు చేయడంతో ఇక్కడ రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. తన కొడుక్కి మెదక్‌ సీటు ఇవ్వకపోవటంతో ఆగ్రహించిన మైనంపల్లి.. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ క్రమంలో మల్కాజీగిరిలో మైనంపల్లి స్పీడ్‌కి బ్రేకేసేందుకు ఆయనకి గట్టి పోటీనిచ్చేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ.. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిని బరిలో నిలిపింది. ప్రస్తుతం ఆయన ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలో ఐడ్రీమ్‌ న్యూస్‌.. మర్రి రాజశేఖర్‌రెడ్డిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన మల్కాజ్‌గిరిలో ప్రస్తుత పరిస్థితి ఏంటి.. జనాలు ఏమనుకుంటున్నారు.. మైనంపల్లి మీద జనాల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది.. ఎన్నికల్లో విజయం కోసం ఏం చేయబోతున్నారో వివరించారు. ఆ వివరాలు..

మైనంపల్లి కేవలం తన కుమారిడి కోసమే పార్టీ మారరని మల్కాజ్‌గిరి జనాలు బలంగా నమ్ముతున్నారని తెలిపారు మర్రి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నియోజకవర్గ సమస్యలని గాలికి వదిలేశారని మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం పాటు పడలేదని తెలిపారు. సుమారు 6 కోట్ల రూపాయల నిధులను వినియోగించకుండా అలానే వదిలేశారు అని ఆరోపించారు మర్రి రాజశేఖర్‌రెడ్డి.

డిపాజిట్‌ కూడా దక్కదు..

ఇన్నాళ్లు పార్టీలో ఉండి.. ఇప్పుడు తన స్వార్థం కోసం బయటకు వెళ్లిన మైనంపల్లి.. బీఆర్‌ఎస్‌ మీద విమర్శలు చేయడం చాలా దారుణం అన్నారు మర్రి రాజశేఖర్‌రెడ్డి. అయితే ఆయన ఎన్ని చేసినా.. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు. మల్కాజ్‌గిరిలో ఎక్కడా పోటీ అనేది కనిపించడం లేదని.. ఇక్కడ బీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుంది అన్నారు. డిసెంబర్‌ 3న వచ్చే ఫలితాల్లో లక్ష క్లీన్‌ స్వీప్‌ ఉంటుంది.. ఎదుటి వాళ్లకి డిపాజిట్‌ కూడా దక్కదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాక తాము కొట్టే దెబ్బకి మైనంపల్లి షేక్‌ అవ్వాల్సిందే అన్నారు.

అంతేకాక మల్కాజ్‌గిరి ప్రజలు నియోజకవర్గ అభివృద్ధిని ఆశిస్తున్నారు. పరిశ్రమలు రావాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నారు. అంతేకాక వర్షాకాలంలో జనాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యలను పరిష్కరించాలని జనాలు కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి.. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. తాను కేసీఆర్‌ను చూసి ఇన్‌స్ఫైర్‌ అయ్యానని అందుకే అరుంధతి హస్పిటల్స్‌ ప్రారంభించి.. ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

అరుంధతి ఆస్పత్రుల ప్రత్యేకత అదే..

‘‘అరుంధతి ఆస్పత్రులకు సంబంధించి ఒక విషయం గర్వంగా చెప్పగలను. దేశంలో ఉచితంగా ఒపెన్‌ హార్ట్‌ సర్జరీ చేసే ఆస్పత్రి ఎక్కడా లేదు.. అలానే ఎమ్‌ఆర్‌ఐ టెస్ట్‌, సీటీ టెస్ట్‌.. ఎలాటి పరీక్షలు చేసుకోవాలన్నా.. వేలకు వేలు కావాలి. కానీ అరుంధతి ఆస్పత్రిలో అలా ఉండదు. జేబులో రూపాయి లేకుండా ఇక్కడకు వచ్చి ఉచితంగా ఈ సేవలు పొందవచ్చు. ఇక్కడ కులం, మతాలు చూడం. వారి ఆరోగ్యమే మాకు ముఖ్యం. అందుకే ఇక్కడ అన్ని వైద్య సేవలు ఉచితంగా అందిస్తాం’’ అని తెలిపారు. ఇక వ్యక్తిగతంగా తన మీద తన తండ్రి, మామ మల్లారెడ్డి ప్రభావం ఎంతో ఉంది. రాజకీయంగా కేసీఆర్‌ ప్రభావం ఎక్కువగా ఉంది అన్నారు మర్రి రాజశేఖర్‌రెడ్డి.