Krishna Kowshik
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం చివరి దశకు చేరుకుంటోంది. ఎన్నికల ప్రచారానికి రేపటితో తెరపడనుంది. ఈ క్రమంలో ఆయా పార్టీలకు చెందిన నేతలు విస్తృతంగా ప్రచారాన్ని చేపడుతున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం చివరి దశకు చేరుకుంటోంది. ఎన్నికల ప్రచారానికి రేపటితో తెరపడనుంది. ఈ క్రమంలో ఆయా పార్టీలకు చెందిన నేతలు విస్తృతంగా ప్రచారాన్ని చేపడుతున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే..
Krishna Kowshik
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి మరింత హాట్ ఎక్కింది. అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, అగ్ర నేతలు సభలు, ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారానికి కేవలం ఒక్క రోజు మిగిలి ఉండటంతో విస్తృతంగా ప్రచారాలు చేపడుతున్నారు. ఇంటింటికి, వాడ వాడకు తిరుగుతూ జనాల్లోకి వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఒక పార్టీ నేతలపై, మరొక పార్టీ నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు పరిపాటిగా మారిపోయాయి. ఈ క్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మల్లారెడ్డి తరుఫున ఆయన కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు.
స్పీచులు ఇవ్వడంలో మామకు ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రసంగిస్తున్నారు ప్రీతి. చాలా జోరుగా ప్రచారం చేస్తూ.. అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ క్రమంలో తనపై ప్రతిపక్ష పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపించారామె. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ‘గత నెల రోజులుగా ప్రచారంలో పాల్గొంటున్నాను. మేడిపల్లిలోని ఎస్వీఎం గ్రాండ్ హోటల్‌లో బస చేస్తున్నారు. కానీ ఈ రోజు కాంగ్రెస్‌కు చెందిన 25 మంది మహిళా, పురుష కాంగ్రెస్ నేతలు నా రూంకి వచ్చి నన్ను బెదిరించారు. భయపెట్టారు. నా మీద అరిచారు. నన్ను గలీజు గలీజు మాటలతో తిట్టారు. ఎందుకు తిడుతున్నారో నాకు అర్థం కాలేదు. వాళ్ల ప్రచారం వాళ్లది, మా ప్రచారం మాది. ఇలాంటి రౌడీయిజం అవసరమా.
కాంగ్రెస్ ఇంకా గెలవనేలేదు. వారు గెలిచే అవకాశం కూడా లేదు. భయపెడుతున్నారు. కాంగ్రెస్ ఓడిపోతుందని అర్థమైంది, అందుకే వారు ఏం చేయలేక.. ఇలాంటి బెదిరింపులకు దిగుతున్నారు. భయపెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్లు నేనుంటున్న, అందులోను ఓ మహిళ అని చూడకుండా హోటల్ రూమ్‌లోకి నేరుగా వచ్చి నన్ను బెదిరించడం సరైన చర్య కాదు. ఇది భరించలేనిది. ఇలాంటి పార్టీకి సపోర్టు చేయొద్దు, ఓట్లు వేయొద్దు’ అని ప్రీతి రెడ్డి ఓటర్లకు విన్నవించారు. మల్లారెడ్డి కోడలిపై కాంగ్రెస్ నేతలు ఇలాంటి బెదిరింపులకు దిగుతుండటంపై బీఆర్ఎస్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ చర్యలను ఖండిస్తున్నారు.