లాయర్ల ఫీజుకే రూ. 2వేల కోట్లు.. ఆ డబ్బులు ఎక్కడివి బాబు?: లక్ష్మీపార్వతి

స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబు.. దాన్నుంచి బయటపడటం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తన తరఫున వాదించడానికి పేరు మోసిన లాయర్లను నియమించుకున్నా ప్రయోజనం శూన్యం. ఈ క్రమంలో లక్ష్మీపార్వతి.. చంద్రబాబు లాయర్ల ఖర్చు గురించి సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాలు..

స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబు.. దాన్నుంచి బయటపడటం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తన తరఫున వాదించడానికి పేరు మోసిన లాయర్లను నియమించుకున్నా ప్రయోజనం శూన్యం. ఈ క్రమంలో లక్ష్మీపార్వతి.. చంద్రబాబు లాయర్ల ఖర్చు గురించి సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాలు..

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు అరెస్టైన నాటి నుంచి బెయిల్‌ మీద బయటకు రావడం కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. తన తరఫున వాదించడం కోసం దేశంలోనే ప్రఖ్యాతి చెందిన లాయర్లను నియమించుకున్నారు. అయినా సరే.. చంద్రబాబుకి మాత్రం ఊరట లభించడం లేదు. ఎందుకంటే ఈ కేసులో సాక్ష్యాధారాలు అన్ని పక్కగా ఉన్నాయి. దాంతో ఎంత గొప్ప లాయర్‌ని నియమించుకున్నా సరే బాబుకు లాభం లేకుండా పోతుంది. పైగా లాయర్‌ ఫీజులు భారీగా అవుతున్నాయనే టాక్‌ కూడా వినిపిస్తోంది ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు లాయర్ల ఫీజుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ తెలుగు అకాడమీ చైరపర్సన్‌ లక్ష్మీపార్వతి సంచన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

స్కిల్‌ స్కామ్‌ కేసు కోసం చంద్రబాబు నియమించుకున్న లాయర్ల ఫీజుకే ఏకంగా 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని.. లాయర్లకు వేల కోట్ల ఫీజులు చెల్లించడానికి.. చంద్రబాబుకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఈ సందర్భంగా లక్ష్మీ పార్మతి ప్రశ్నించారు. దాచుకున్న అవినీతి సొమ్మును.. లాయర్లకు చెల్లించడానికే లోకేష్‌ ఢిల్లీలో మకాం పెట్టాడేమో అని ఎద్దేవా చేశారు. 40 రోజులుగా చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు పనిచేస్తున్నారని, సీనియర్‌ లాయర్లకు రోజు రూ. కోటి నుంచి రూ.2.50 కోట్ల ఫీజు ఉందని తెలిపారు.

ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వరకు నడుస్తున్న చంద్రబాబు కేసుల మీద వాదించడానికి రోజుకు అన్ని ఖర్చులు కలిసి మూడు కోట్లు అయితే.. ఇప్పటి వరకు లాయర్ల ఫీజుకే రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు అయి ఉండొచ్చని ఆరోపించారు. ఈ మొత్తాన్ని చెల్లించడం కోసం ఎక్కడెక్కడో దాచిన అవినీతి సొమ్మును బయటకు తీస్తున్నారేమో అనే సందేహాలు వ్యక్తం చేశారు.

2 శాతం హెరిటేజ్‌ షేర్లను విక్రయిస్తే రూ. 400 కోట్ల ఆదాయం వస్తుందని గతంలో భువనేశ్వరి చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. న్యాయవాదలు ఫీజులు, ఇతర ఖర్చులు చెల్లించడానికి ఆమె 5000 కోట్లకు మించి ఎన్ని షేర్లను విక్రయించారో చెప్పాలని ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి డిమాండ్‌ చేశారు. లాయర్ల ఫీజు చెల్లించడానికి భారీ మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చిందో.. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యలు చెప్పాలని, వారి సంపద, ఆదాయ వివరాలను బహిర్గతం చేయాలని లక్ష్మీ పార్వతి డిమాండ్‌ చేశారు.

లాయర్లకు ఎంత చెల్లిస్తున్నారు.. ఆ డబ్బును ఎక్కడనుంచి తెస్తున్నారనే విషయం చంద్రబాబును రోజు తమ పేపర్లలో, టీవీలలో చూపిస్తున్న పచ్చమీడియా అయినా దీనికి సమాధానం ఇవ్వాలని కోరారు. దేశ ప్రధానిగా 16 సంవత్సరాలు పనిచేసిన ఇందిరాగాంధీ కూడా తన కేసును వాదించడానికి ఇద్దరే లాయర్లను పెట్టుకున్నారని.. కానీ చంద్రబాబు మాత్రం ఏకంగ ఆ19 మంది లాయర్లను పెట్టుకున్నారని.. ఇంత స్థాయిలో అమెరికా ప్రెసిడెంటు కూడా పెట్టుకోలేదనుకుంటానంటాను అంటూ లక్ష్మీపార్వతి సెటైర్లు వేశారు.

Show comments