iDreamPost
android-app
ios-app

KTR: ఎన్నికల ఫలితాలపై KTR ఫస్ట్ రియాక్షన్! ట్వీట్ వైరల్!

KTR-TS Election Result 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ వెనుకబడ్డంపై కేటీఆర్‌ స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో..

KTR-TS Election Result 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ వెనుకబడ్డంపై కేటీఆర్‌ స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో..

KTR: ఎన్నికల ఫలితాలపై KTR ఫస్ట్ రియాక్షన్! ట్వీట్ వైరల్!

తెలంగాణ ఎన్నికలు 2023 ఫలితాలకు సంబంధించి అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ వెనుకబడిపోయింది. మొత్తం 119 స్థానాలకు గానూ.. 3 గంటల ప్రాంతం వరకు 39 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించగా.. బీఆర్‌ఎస్‌ కేవలం 15 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పూర్తి మెజార్టీ సాధిస్తుందని భావించిన బీఆర్‌ఎస్‌ పోటీలో కూడా లేకుండా పోయింది. ఇక, బీఆర్‌ఎస్‌ ఓటమి పాలవ్వటంపై కేటీఆర్‌ స్పందించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. రెండు దఫాలు బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించి, అధికారంలోకి తీసుకొచ్చిన తెలంగాణ ప్రజలకు రుణపడి ఉన్నాను.

ఈ రోజు ఫలితాలను చూస్తుంటే బాధగా లేదు.. నిరాశగా ఉంది. ఇంత దారుణమైన నెంబర్లను మేము ఊహించలేదు. దీన్నుంచి మేము నేర్చుకుంటాము.. తప్పుల్ని సరిదిద్దుకుంటాము. కాంగ్రెస్‌ పార్టీకి కృతజ్ఞతలు. మీకు గుడ్‌ లక్‌’’ అని రాసుకొచ్చారు. మరి, కేసీఆర్‌ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు. గజ్వేల్‌, కామారెడ్డిను బరిలో నిలబడ్డారు. అయితే, అనుకోని విధంగా కామారెడ్డిలో కేసీఆర్‌ ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. మరి, తెలంగాణ ఎన్నికలు 2023లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.