iDreamPost
android-app
ios-app

ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారు పడొద్దు.. హ్యాట్రిక్ కొడతాం: KTR

తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు కూడా పూర్తి కాకుండానే ఎగ్జిట్ పోల్స్ ఎలా వస్తాయంటూ ప్రశ్నించారు.

తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు కూడా పూర్తి కాకుండానే ఎగ్జిట్ పోల్స్ ఎలా వస్తాయంటూ ప్రశ్నించారు.

ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారు పడొద్దు.. హ్యాట్రిక్ కొడతాం: KTR

తెలంగాణ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చిన్న చిన్న అల్లర్లు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికలు పూర్తవ్వగానే అందరూ ఎగ్జిట్ పోల్స్ గురించే మాట్లాడుకుంటారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ని వెల్లడించాయి. వాటిలో మెజారిటీ పోల్స్ కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలను కట్టబెట్టింది. అలాగే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీని అందించలేదు. తెలంగాణలో హంగ్ తప్పదు అనే విధంగా ఆ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ గురించి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అసలు ఎగ్టిట్ పోల్స్ అనేవి రబ్బిష్ అంటూ కొట్టిపారేశారు.

కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్ ని కొట్టి పారేయడమే కాకుండా.. అవి తప్పని రుజువైతే క్షమాపణలు చెప్తారా అంటూ ప్రశ్నించారు. ఒక పక్క పోలింగ్ జరుగుతూనే ఉంది. అప్పుడే ఎగ్జిట్ పోల్స్ అంటూ విడుదల చేయడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ ని గతంలో కూడా చూశామంటూ ఎద్దేవా చేశారు. తప్పకుండా హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అంటూ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ భరోసానిచ్చారు. “ఆ రోజు కొన్ని నేషనల్ మీడియాస్ కూడా ఫలితాలు ఇచ్చాయి. వాళ్లు సర్వే చేయరు ఏం చేయరు. ఒక 200 మందిని సర్వే చేసి ఫలితాలు అంటూ ఇస్తారు. మాకు వచ్చిన సమాచారం ఆధారంగా చెప్పాము అంటారు. కానీ, మీ క్రెడిబిలిటీ అనేది ప్రమాదంలో పడుతుంది. తర్వాత మిమ్మల్నే నమ్మడం మానేస్తారు. ఇంకా ఓటింగ్ జరుగుతూనే ఉంది. కానీ, మీరు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నారు.

ఎలక్షన్ కమిషన్ కూడా ఎగ్జిట్ పోల్స్ ని అనుమతించడం తప్పు. ఇంకా ఎన్నికలు పూర్తవ్వకుండానే ఎగ్జిట్ పోల్స్ ని వెల్లడించడానికి అనుమతించకూడదు. ఒకవేళ డిసెంబరు 3న మీరు చెప్పింది తప్పని తెలిస్తే.. మీరు ప్రజలకు క్షమాపణలు చెప్తారా? నేను కొన్ని పోల్స్ చూసిన తర్వాతే మా పార్టీ శ్రేణుల్లో భరోసా నింపేందుకు వచ్చాను. ఎవరూ కన్ఫూజ్ కావద్దు. వందకు వందశాతం మన అధికారం వస్తుంది. అందరూ ఎంతో కష్టపడ్డారు. మనం 70కి పైగా స్థానాల్లో గెలుస్తామని అనిపిస్తోంది. పోలింగ్ పర్సంటేజ్ తెలియదు. రేపు ఉదయం ఫైనల్ పోలింగ్ ఎంత జరిగింది అనేది తెలుస్తుంది. ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ జరిగింది? అనేది తెలుస్తుంది. హైదరాబాద్ లో మాత్రమే కాదు.. ఢిల్లీ, ముంబయి వంటి అర్బన్ ప్రాంతాల్లో ఓటర్లు బయటకు రారు. కానీ, వాళ్లే ఎక్కువ ఫిర్యాదులు చేస్తుంటారు. ఇప్పుడు మేము వాళ్ల మీద ఫిర్యాదు చేయాలి కావచ్చు” అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. వందకు వంద శాతం తాము హ్యాట్రిక్ కొట్టబోతున్నామంటూ ధీమా వ్యక్తం చేశారు.