Dharani
Komatireddy Venkat Reddy-BRS MLAs: త్వరలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది అంటూ ఆరోపణలు చేసే వారికి హస్తం పార్టీ మంత్రి కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాలు..
Komatireddy Venkat Reddy-BRS MLAs: త్వరలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది అంటూ ఆరోపణలు చేసే వారికి హస్తం పార్టీ మంత్రి కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ దృష్టంతా ఆరు గ్యారెంటీల అమలు మీదనే ఉన్నది. ఇదిలా ఉండగా విపక్ష నేతలు మాత్రం.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని.. ఆరు నెలల్లో రేవంత్ సర్కార్ కూలిపోతుందని కామెంట్స్ చేశారు. ఇక మరొ కొందరైతే.. మాజీ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
ఇలా ఆరోపణలు చేసే వారికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వం కూలి పోవడం కాదు.. త్వరలోనే విపక్ష పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చెప్పి బాంబు పేల్చారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికిక రెడీగా ఉన్నారని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలు..
తాజాగా నల్గోండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులతో పాటు రాబోయే లోక్ సభ ఎన్నికల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే.. రానున్న లోక్‌సభ ఎలక్షన్స్‌లో కూడా అత్యధిక సీట్లు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అలానే లోక్‌సభ ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు 30మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారంటూ మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంటూ కామెంట్స్ చేసే వారికి కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వాన్ని కూల్చడం కాదు.. తాము తల్చుకుంటే.. విపక్ష పార్టీలనే ఖాళీ చేస్తామన్నట్లుగా కోమటిరెడ్డి మాట్లాడారు.
కొన్ని రోజుల క్రితం.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కుట్రలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. ఇప్పటికే వారితో సంప్రదింపులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు బండి సంజయ్. అలానే కాంగ్రెస్ పార్టీలో కొందరు కేసీఆర్ కోవర్టులు ఉన్నారని.. వారి ద్వారానే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. అంతేకాక కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి.. ఇదంతా బీజేపీ చేసిందని బదనాం చేస్తారని సంజయ్ అన్నారు.
లోక్ సభ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తారు – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి pic.twitter.com/57TY5r6FLc
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2024