iDreamPost
android-app
ios-app

బాంబ్‌ పేల్చిన కోమటిరెడ్డి.. 30 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ

  • Published Mar 30, 2024 | 8:29 AM Updated Updated Mar 30, 2024 | 8:29 AM

Komatireddy Venkat Reddy: అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్న వేళ.. మంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ వివరాలు..

Komatireddy Venkat Reddy: అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్న వేళ.. మంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ వివరాలు..

  • Published Mar 30, 2024 | 8:29 AMUpdated Mar 30, 2024 | 8:29 AM
బాంబ్‌ పేల్చిన కోమటిరెడ్డి.. 30 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కీలక నేతలు హస్తం పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె, కేకే, జీహెచ్‌ఎంసీ మేయర్‌, కేకే కూతురు విజయలక్ష్మి సైతం కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తాజా పరిణామాలు బీఆర్‌ఎస్‌ అగ్ర నేతల్లో వణుకు పుట్టిస్తుండగా.. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ వివరాలు..

బీఆర్ఎస్ నుంచి దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని.. ఏ క్షణంలోనైనా పార్టీ మారే అవకాశం ఉందంటూ బాంబ్‌ పేల్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంతేకాక రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ అనేది కేవలం కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉంటుందని.. బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇదిలా ఉంటే.. అధికారం లేకుండా కేసీఆర్ కుటుంబం మనుగడ సాగించలేకపోతోందంటూ కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.

అంతేకాక బీఆర్‌ఎస్‌ పార్టీ ఖాళీ అవుతుంటే కేటీఆర్ మైండ్ బ్లాక్ అయి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ మనుగడే లేదని.. అందుకే టికెట్ ఇచ్చినా వద్దు అని ప్రకటిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తాము గేట్లు తెరవటం కాదు.. గేట్లు పగలగొట్టుకుని వచ్చి మరీ కాంగ్రెస్‌లో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాక బీఆర్‌ఎస్‌ పార్టీలో ఒక్కరూ కూడా మిగలరంటూ కోమటిరెడ్డి జోస్యం చెప్పుకొచ్చారు.

అంతేకాక సుమారు పదేళ్ల పాటు తెలంగాణను పాలించిన కాలంలో కేసీఆర్ చేసిన అవినీతిని వెలికి తీయడానికి తమ ప్రభుత్వానికి 20 ఏళ్లు పడుతుందని.. అంతగా బీఆర్‌ఎస్‌ నేతలు అవినీతి చేసినట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. తన కుటుంబం ఎంపీ టికెట్ కోసం ఎలాంటి లాబీయింగ్ చేయలేదని స్పష్టం చేశారు కోమటిరెడ్డి. తన సోదరుడు రాజ్ గోపాల్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

బీజేపీ మీద స్పందిస్తూ.. తెలంగాణ గడ్డ ఉద్యమాల పోరాట గడ్డ అని.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక లెక్క తెలంగాణ ప్రభుత్వాన్ని పడకొడితే ఊరుకోమని హెచ్చరించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టటం తరువాత కానీ.. ముందు బీజేపీకి ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి రాకుండా చూసుకుంటే చాలని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.