Tirupathi Rao
తెలంగాణ ఎన్నికలు 2023 ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ ఫలితాలను బీఆర్ఎస్ పార్టీ కూడా స్వీకరిస్తోంది. మరోవైపు రాజీనామా చేసేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఎన్నికలు 2023 ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ ఫలితాలను బీఆర్ఎస్ పార్టీ కూడా స్వీకరిస్తోంది. మరోవైపు రాజీనామా చేసేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Tirupathi Rao
తెలంగాణ ఎన్నికలు 2023 ఫలితాలు దాదాపుగా ఖరారు అయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ముగింపు దశకు చేరుకుంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. గెలుపు, ఆధిక్యం కలుపుకుని దాదాపు 65 సీట్లలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ గెలుపు, ఆధిక్యం కలుపుకుని 39 సీట్లకే పరిమితమైంది. ఈ ఫలితాలను బీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు స్వీకరిస్తున్నాయి కూడా. ఇప్పటికే రాజీనామా చేసేందుకు కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏ పార్టీ సపోర్ట్ లేకుండా కాంగ్రెస్ పార్టీ స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఊహించని ఫలితాలను సొంతం చేసుకుంది. ఈ ఫలితాలను పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మాత్రమే కాదు.. అధిష్టానం కూడా జీర్ణించుకోలేకపోతోంది. కానీ, ప్రజల తీర్పును శిరసావహిస్తాం అంటూ బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామంటూ హరీశ్ రావు కామెంట్ చేశారు. కేటీఆర్ కూడా రెండుసార్లు అధికారాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజనీకానికి రుణపడి ఉంటామన్నారు. ఇలాంటి నంబర్స్ ని అస్సలు ఊహించలేదన్నారు. కానీ, ఈ ఫలితాల నుంచి కచ్చితంగా పాఠాలు నేర్చుకుంటామన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు కూడా తెలిపారు.
ఇదిలా ఉండగా.. రాజీనామా చేసేందుకు కేసీఆర్ రాజ్ భవన్ కు చేరుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం కార్యాలయం గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో రాజ్ భవన్ కు చేరుకుని తన రాజీనామాని గవర్నర్ కు అందజేయనున్నట్లు సమాచారం. అయితే సీఎం కార్యాలయం డిసెంబర్ 1న ఒక పోస్టు చేసింది. “డిసెంబర్ 4, సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది” అంటూ సీఎం కార్యాలయం పోస్ట్ చేసింది. కేబినెట్ సమావేశం తర్వాత గవర్నర్ ను కలిసి కేసీఆర్ రాజీనామా సమర్పిస్తారు అనుకున్నారు. కానీ, ఆదివారమే గవర్నర్ ని కలిసి తన రాజీనామాను కేసీఆర్ అందజేయనున్నట్లు తేలుస్తోంది. ఇదిలా ఉండగా.. కామారెడ్డి ప్రజలు కేసీఆర్, రేవంత్ రెడ్డిని కాదని బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. కామారెడ్డి నియోజవర్గంలో బీజేపీ అభ్యర్తి రాటిపల్లి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. కేసీఆర్ రెండోస్థానంలో నిలవగా.. రేవంత్ రెడ్డి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. కామారెడ్డి ప్రజలు స్థానికేతరులను నమ్మలేదంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి.. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.