Dharani
Dharani
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది.. పొలిటికల్ వాతావరణం హీట్ ఎక్కుతోంది. అధికార వైసీపీ సంక్షేమ పాలన అందించి.. ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకోగా.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక.. బీజేపీ, జనసేనలతో పొత్తు కోసం వెంపర్లాడుతోంది. ఓ వైపు చంద్రబాబు బీజేపీకి దగ్గరలవ్వాలని విపీరతంగా ప్రయత్నిస్తుండగా.. కాషాయ పార్టీ మాత్రం మరోసారి బాబును నమ్మడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు అని తాజా చర్యల ద్వారా నిరూపితం అయ్యింది. వారం రోజుల క్రితం కేంద్ర ఐటీ శాఖ చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నోటీసులు జారీ చేసింది.
అయితే తనపై ఎన్ని కేసులు నమోదయినా సరే.. వాటిపై విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకోవడం చంద్రబాబుకు అలవాటైన అంశమే. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఐటీ శాఖ ఈ సారి ఏకంగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు అభ్యంతరాలను కూడా తోసిపుచ్చింది. దాంతో జరుగుతున్న పరిణామాలన్ని చూస్తే.. కేంద్రం.. బాబు చుట్టూ బలమైన ఉచ్చు బిగిస్తోందని అర్థం అవుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అనగా.. 2016-2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.ఇందుకు సంబంధించి ఐటీ శాఖకు ఖచ్చితమైన సమాచారం అందింది. షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్‌వాసుదేవ్ ఇచ్చిన వాంగ్మూలంలో.. 2016 సంవ్సతంలో.. చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్ ద్వారా.. ముడుపులు చెల్లించినట్లు అంగీకరించారు. ఐటీ శాఖ అధికారులు మనోజ్ నివాసాలలో తనిఖీలు చేపట్టగా.. ఈ స్కాం బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా ఐటీ శాఖ జారీ చేసిన నోటీసుల్లో.. ఇన్‌ఫ్రా కంపెనీల ద్వారా అందుకున్న 118 కోట్ల రూపాయలను బ్లాక్ మనీగా ఎందుకు పరిగణించరాదో తెలపాలని కోరింది.
ఈ క్రమంలో ఆగస్ట్ 4న హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం నుంచి సెక్షన్ 153సీ కింద మరోసారి నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. పక్కా ఆధారాలతోనే చంద్రబాబుకు నోటీసులు జారీ చేసినట్లు.. ఐటీ వర్గాల నుంచి సమాచారం. నాలుగు సార్లు చంద్రబాబు, ఐటీ శాఖల మధ్య లేఖలు నడిచాయని తెలుస్తోంది. చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తోసిపుచ్చినట్లు సమాచారం. అంతేకాక కొన్ని లావాదేవీలపై ఐటీ శాఖ ఆధారాలు సైతం జారీ చేసింది. అయితే ఈ అంశంలో చంద్రబాబు వివరణపై ఐటీ శాఖ సంతృప్తి చెందలేదని.. దాంతో మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసిందంటున్నారు. ఈ చర్యలన్ని చూస్తే.. కేంద్రం.. బాబు చుట్టూ బలమైన ఉచ్చు బిగిస్తోందని స్పష్టంగా అర్థం అవుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇలా ఉండగా చంద్రబాబు మీద ఎంత చిన్న ఆరోపణ వచ్చినా సరే.. టీడీపీ నేతలు, పచ్చ మీడియా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సత్య హరిశ్చంద్రుడి లాంటి చంద్రబాబును వేధించడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయని భారీ ఎత్తున ప్రచారం చేస్తాయి. అంతేకాక.. కేసులపై విచారణ జరగకుండ.. బాబు కూడా స్టేలు తెచ్చుకుంటాడు. అయితే తాజాగా ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన అంశంలో.. ఇవేమి కనిపించడం లేదు. ఐటీ నోటీసులు అంశంలో వైసీపీ నేతలు మాత్రం.. తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
ఏడాది కిందటే ఐటీ నోటీసులు వస్తే.. చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు.. అమరావతి పేరు చెప్పి.. వేల కోట్లు దోచుకున్నారని అర్థం అవుతోంది.. దీనిపై టీడీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. మనీ లాండరింగ్ జరిగితే.. ఈడీ ఎందుకు మౌనంగా ఉందని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల ముందు.. చంద్రబాబు మీద వచ్చిన ఐటీ నోటీసులు.. రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా హీటేక్కించాయి. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తాడో.. ఐటీ శాఖ ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలంటన్నారు రాజకీయ విశ్లేషకులు.