iDreamPost
android-app
ios-app

ఏంటి 50 వేలు ఖర్చు పెట్టింది రూపాయి కోసమా?.. యువకుడి షాక్

Man Spends 50K For 1 Rupee: కొన్నిసార్లు విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఏదో పెద్ద ఆపద అని భావిస్తే.. తీరా చివరి దశకు వచ్చాక ఓసింతేనా.. ఈ మాత్రం దానికేనా ఇంత హడావుడి చేసింది అని అనిపిస్తుంది. ఒక యువకుడి విషయంలో అదే జరిగింది. ఒక రూపాయి సమస్య కోసం 50 వేలు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది.

Man Spends 50K For 1 Rupee: కొన్నిసార్లు విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఏదో పెద్ద ఆపద అని భావిస్తే.. తీరా చివరి దశకు వచ్చాక ఓసింతేనా.. ఈ మాత్రం దానికేనా ఇంత హడావుడి చేసింది అని అనిపిస్తుంది. ఒక యువకుడి విషయంలో అదే జరిగింది. ఒక రూపాయి సమస్య కోసం 50 వేలు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది.

ఏంటి 50 వేలు ఖర్చు పెట్టింది రూపాయి కోసమా?.. యువకుడి షాక్

ఒక్కోసారి అంతే లాటరీలో లక్ తగిలినట్టు దరిద్రం తగిలేస్తుంటుంది. అడుగు భూమి కోసం తరాల తరబడి కొట్టుకుంటూ ఉంటారు. కోర్టుల చుట్టూ తిరుగుతారు. తీరా తీర్పు వచ్చే నాటికి కోర్టు ఫీజులకు పెట్టిన ఖర్చంత ఉండదు ఆ భూమి విలువ. ఈలోపు ప్రాణాలు కూడా పోతాయి. అలా ఉంటాయి కొన్ని సన్నివేశాలు. అయితే ఇది తెలిసి పెట్టుకునే పంచాయితీ. కానీ ఇక్కడ ఒక యువకుడు సమస్య వచ్చిందని 50 వేలు ఖర్చు పెడితే తీరా ఆ సమస్య విలువ రూపాయి అని తెలిసి షాక్ అయ్యాడు. ఏంటి నేను 50 వేలు ఖర్చు పెట్టింది ఈ రూపాయి సమస్య కోసమా? అని అవాక్కయ్యాడు. అదే విషయాన్ని ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. 

ఢిల్లీకి చెందిన అపూర్వ జైన్ అనే యువకుడికి ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చాయి. ఆ నోటీసుల్లో పేర్కొన్న ట్యాక్స్ వివాదాలను పరిష్కరించుకోవడం కోసం ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ని కాంటాక్ట్ అయ్యాడు. ఈ సమస్య పరిష్కారం కోసం సదరు సీఏకి 50 వేల రూపాయలు ఫీజు చెల్లించాడు. తీరా చూస్తే అదేమన్నా పెద్ద సమస్య అంటే అలాంటిదేం లేదు. కేవలం రూపాయి సమస్య కోసం 50 వేలు ఖర్చు పెట్టాడా యువకుడు. దీంతో షాకవ్వడం అపూర్వ జైన్ వంతు అయ్యింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఇటీవల తాను ఐటీ నోటీసు అందుకున్నానని.. సీఏని కలిసి 50 వేలు ఫీజు కూడా చెల్లించానని వెల్లడించాడు. అయితే చివరికి ఆ వివాదాస్పద పన్ను విలువ రూపాయి అని తేలిందని.. తాను జోక్ చేయడం లేదంటూ ట్వీట్ చేశాడు.

దీనిపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఫన్నీగా కామెంట్స్ చేస్తుండగా.. మరికొంతమంది పన్ను విధానాలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది చివరికి చిలికి చిలికి గాలి వానగా మారడంతో వివాదాస్పదంగా మారింది. భారీ ఎత్తున నెటిజన్స్ డిబేట్ స్టార్ట్ చేయడంతో ఆదాయపు పన్ను శాఖ వైపు మళ్లింది. దీంతో అపూర్వ జైన్ స్పందిస్తూ.. మరొక ట్వీట్ చేశాడు. తనకు మొదట లక్షల రూపాయలకు సంబంధించి నోటీసులు వచ్చాయని.. కేసు చివరకు వచ్చేనాటికి ఒక రూపాయి పన్ను వివాదంగా మారిందని అన్నాడు. అది మరి పరిస్థితి. లక్షలకు సంబంధించి నోటీసులు వస్తే పరిష్కారం కోసం సీఏని కాంటాక్ట్ అయితే.. అతను 50 వేలు ఫీజు తీసుకుని సాల్వ్ చేస్తే చివరికి పరిష్కరించిన సమస్య విలువ ఎంతయ్యా అంటే రూపాయి. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి