iDreamPost
android-app
ios-app

బాబుని ఇరికిస్తున్న పురంధేశ్వరి! చిన్నమ్మ ఇలా పగ పట్టావేంటి?

చంద్రబాబు పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహరిస్తున్న తీరు ఆయనను మరిన్ని కేసుల్లో అరెస్టయ్యే విధంగా చేస్తున్నాయంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబు పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహరిస్తున్న తీరు ఆయనను మరిన్ని కేసుల్లో అరెస్టయ్యే విధంగా చేస్తున్నాయంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

బాబుని ఇరికిస్తున్న పురంధేశ్వరి! చిన్నమ్మ ఇలా పగ పట్టావేంటి?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ చేత అరెస్టై రాజమండ్రి సెట్రల్ జైళ్లో 53 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య కారణాల దృష్ట్యా ఏపీ హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా బాబుపై స్కిల్ స్కామ్ కేసుతో పాటు ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్, మధ్యం స్కాం, ఇసుక స్కాం వంటి కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులన్నింటిలో బాబు పాత్ర ఉందన్న ఆరోపిస్తూ.. ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. అయితే ఇక్కడే ఓ గమ్మత్తైన వ్యవహారం చోటుచేసుకుంది. అదేంటంటే.. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరీ బాబు పట్ల వ్యవహరిస్తున్న తీరు.

చంద్రబాబు అరెస్టును బహిరంగంగానే ఖండించిన పురందేశ్వరీ.. ఆయనను కేసుల నుంచి బయటపడేలా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పురందేశ్వరీ చూపించే బందు ప్రీతి బాబును మరిన్ని కేసుల్లో ఇరికించే విధంగా ఉందంటూ తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. బాబును వెనకేసుకొచ్చే ప్రయత్నంలో పురందేశ్వరీ ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వంపైన, జగన్‌పైన ఆరోపణలు చేస్తూనే ఉంది. వైసీపీ ప్రభుత్వం ఇసుక అక్రమాలకు పాల్పడిందని, మద్యం స్కాంలకు తెరలేపిందని చిన్నమ్మ విమర్శలు గుప్పిస్తూనే ఉంది.

మద్యం అమ్మకాల్లో రూ.32 వేల కోట్ల కుంభకోణం జరిగిందని సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ క్రమంలో వైసీపీపై ఆమె చేసిన ఆరోపణలు తిరిగి బాబును ఇరికించే విధంగా మారాయి. అసలు మద్యం వ్యవహారం, ఇసుక స్కాంలపై లోతుగా విచారణ చేపడితే ఏపీ సీఐడీకి బాబు హయాంలో జరిగిన స్కామ్స్ తెలిసి వచ్చాయి. దీంతో ఆయనపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే బాబుపై మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులిచ్చిన కేసులో ఎ2గా, ఇసుక స్కాంలో ఎ3 నిందితుడిగా కేసులు నమోదయ్యాయి.

చిన్నమ్మ చేస్తున్న ఎమోషనల్ ఆరోపణలు బాబును సెంటిమెంట్ గా అరెస్టయ్యేలా చేస్తున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబును రక్షించే క్రమంలో చిన్నమ్మ వైసీపీపై చేస్తున్న ఆరోపణలు బాబుకు శాపంగా మారాయని టీడీపీ శ్రేణులు వాపోతున్నట్లు తెలుస్తోంది. చిన్నమ్మ చేస్తున్న ఆరోపణలు చంద్రబాబుపైన కేసు నమోదవ్వడానికి కారణవుతుండడంతో టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. బాబుకు మేలు చేస్తున్నావా.. ఇరికిస్తున్నావా.. ఇలా పగబట్టావేంటి చిన్నమ్మా అంటూ తెలుగు తమ్ముళ్లు ఎగతాళి చేస్తున్నారు.