iDreamPost
android-app
ios-app

వీడియో: సెక్యూరిటీని కొట్టిన తెలంగాణ హోమంత్రి మహమూద్ అలీ!

  • Published Oct 06, 2023 | 2:03 PM Updated Updated Oct 06, 2023 | 2:03 PM
  • Published Oct 06, 2023 | 2:03 PMUpdated Oct 06, 2023 | 2:03 PM
వీడియో: సెక్యూరిటీని కొట్టిన తెలంగాణ హోమంత్రి మహమూద్ అలీ!

తెలంగాణ హోమంత్రి మహమూద్ అలీ వివాదంలో చిక్కుకున్నారు. సహనం కోల్పోయి సెక్యూరిటీ గార్డు, కానిస్టేబుల్ చెంప చెళ్లుమనించారు. సీఎం అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అమీర్ పేట డీకే రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలకు హోమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లారు. అప్పటికే వేదికపై ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమూద్ అలీని వేదికపైకి ఆహ్వానించారు. వేదికపైకి వచ్చిన తర్వాత మహమూద్ అలీ మంత్రి తలసానిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

ఇదేరోజు మంత్రి తలసాని పుట్టినరోజు కావడంతో హోమంత్రి షాలువా, బొకే తీసుకొచ్చారు. అయితే వాటిని తనతో తీసుకురాకుండా వచ్చారని సెక్యూరిటీపై మహమూద్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన చెంప పగలగొట్టారు. అది చూసిన తలసాని వద్దని వారించారు కూడా. తర్వాత మంత్రి తలసానికి షాలువా కప్పి, బొకేని అందజేశారు. హోమంత్రి మహమూద్ అలీ చెంప పగలగొట్టడంతో సెక్యూరిటీకి కాసేపు ఏం అర్థం కాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయాడు. అలాగే షాక్ లో ఉండిపోయాడు. తర్వాత తేరుకుని ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş