తెలంగాణ నిరుపేదలకు శుభవార్త! సొంతిల్లు కల నెరవేరబోతుంది!

Good News for The Poor of Telangana: ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల ఉంటుంది.. అది నెరవేర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతుంటారు. ప్రభుత్వం నిరుపేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేరుస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ పేద ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Good News for The Poor of Telangana: ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల ఉంటుంది.. అది నెరవేర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతుంటారు. ప్రభుత్వం నిరుపేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేరుస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ పేద ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

గత ఏడాది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం‌గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిపాలనలో తనదై మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలతో పాటు మరికొన్ని పథకాలు అమలు చేశారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. తాజాగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్న నిరుపేద ప్రజలకు మరో గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు సంబంధించి అర్హులైన వారికి తీపి కబురు అందించింది. ఈ నెలాఖరులోపే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ని ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లను అందజేస్తామని వెల్లడించారు. ఇప్పటికే అధికారులు ఇండ్లకు సంబంధించిన డిజైన్ పై కసరత్తు మొదలు పెట్టారు. వరుస సమావేశాలు నిర్వహించి త్వరలో నాలుగైదు రకాల డిజైన్లను రెడీ చేసినట్లు సమాచారం. కొత్తగా తయారు చేసిన డిజైన్లపై హౌజింగ్ శాఖ మంత్రి సమీక్షించి, సీఎం కి నివేదించిన ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.మరికొన్ని రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు ఎలా ఉండబోతున్నాయో తెలిసిపోతుంది.

ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇందులో చాలా వరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం దాదాపు 80 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో అర్హత కలిగిన వాటిని ప్రభుత్వం ఎంపిక చేయనుంది. అర్హత కలిగి వారికి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం లభించనుంది. లబ్దిదారులు 4.5 లక్షల మందికి రూ.5 లక్షల చొప్పిన మంజూరు చేసేందుకు రూ.22,500 కోట్లు అవసరం కానున్నాయి. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో రూ.7,740 కోట్లు మాత్రమే కేటాయించారుర. రిలైజ్డ్ ఎస్టిమేషన్స్ లో పెంచుతారా? లేదా అన్న విషయం సందిగ్ధంగా ఉంది. ఇక హౌజింగ్ శాఖ హడ్కో నుంచి రూ.3 వేల కోట్లు సేకరించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. కేంద్రం నుంచి ఒక్కో ఇంటికి రూ.1.5 లక్షల చొప్పున నిధులు అందే అవకాశం ఉంది. అయినా కూడా రూ. 500 కోట్ల వరకు లోటు ఏర్పడనుంది.. మరి దీన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్తారో చూడాలి.

 

Show comments