iDreamPost
android-app
ios-app

వీడియో: కోలుకుంటున్న KCR.. చేతికర్ర సాయంతో నడుస్తూ..

KCR Walking Video: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా వేగంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది.

KCR Walking Video: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా వేగంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది.

వీడియో: కోలుకుంటున్న KCR.. చేతికర్ర సాయంతో నడుస్తూ..

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారు. ఇటీవల యశోధ ఆస్పత్రిలో ఎడమతుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. సర్జరీ విజయంవంతం అయ్యింది. ఆస్పత్రిలోనే కొన్నిరోజులు వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని ఇంటికి వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు మారారు. ఆ ఫామ్ హౌస్ లో కూడా కేసీఆర్ వైద్యలు పర్యవేక్షణలోనే ఉన్నారు. కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారు అని చెప్పేందుకు ఒక వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తొండి మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం గురించి వరుసగా అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. త్వరగా కోలుకుంటున్నారని.. అతి త్వరలోనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని.. పార్లమెంట్ ఎన్నికలకు ముందుండి పార్టీని నడిపిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు ఆయన ఆరోగ్యం గురించి వరుస అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. కానీ, ఇంటికి వెళ్లిన తర్వాత ఎలాంటి సమాచారం అందలేదు. కేటీఆర్ అడపాదపడా చెప్తూ ఉన్నా కార్యకర్తలు, అభిమానులు స్వయంగా చూసింది లేదు. హైదరాబాద్ లోని నివాసంలో కొన్నిరోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత కేసీఆర్ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయారు. అక్కడే ఉండి విశ్రాంతి తీసుకుంటూ వేగంగా కోలుకుంటున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలను బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ తన సోషళ్ మీడియాలో మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

మిమ్మల్ని ఇలా చూడడం ఎంతో సంతోషంగా ఉంది కేసీఆర్ సార్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఆ వీడియోలో డాక్టర్ పర్యవేక్షణలో చేతికర్ర సాయంతో కేసీఆర్ నడుస్తూ కనిపించారు. ఈ వీడియో చూసిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే కేసీఆర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేసీఆర్ పై తమకున్న అభిమానాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. కేసీఆర్ అంటే ఫైటర్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొంత వేగంగా కోలుకోవాలి అంటూ ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుత ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. చేతికర్ర సాయంతో కేసీఆర్ నడుస్తున్న వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.