ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారంటూ మరోసారి రుజువైంది. సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల కోసం నవరత్నాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నవరత్నాల్లో కీలకమైన అమ్మఒడి పథకం నిధులు జమ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. నాలుగో విడత అమ్మఒడి నిధులు జమ చేసేందుకు అర్హల జాబితాను కూడా తయారు చేశారు. ఈ నెల 28న అర్హులైన అందరి తల్లల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ఎన్నో సంక్షేమ పథకాల్లో అమ్మ ఒడి కూడా ఒకటి. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మూడు విడతలకు సంబంధించిన నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాలుగో విడత నిధులు జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు సంబంధించిన జాబితాను కూడా సిద్ధం చేశారు. ఈనెల 28న సీఎం జగన్ ఉమ్మడి విజయనగరం జిల్లా పర్యటంచనున్నారు. ఆ పర్యటనలో భాగంగా కురుపాంలో సీఎం జగన్ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఎంపికైన 43,96,402 మంది అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతల్లో డబ్బు జమ చేయనున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో ఏపీ ప్రభుత్వం రూ.19,617 కోట్లు జమ చేసింది.
పదో తరగతి తర్వాత కూడా పథకం కొనసాగుతుందని ప్రభుత్వం ఇప్పటకే స్పష్టం చేసింది. కాకపోతే ఐటీఐ, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీల్లో చేరే విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన పేరిట ఈ పథకాన్ని అందించనున్నారు. కుటుంబ ఆదాయం రూ.12 వేలు, గ్రామాల్లో అయితే రూ.10 వేలు ఆదాయం ఉన్న కుటుంబాలను ఈ పథకాల్లో చేర్చారు. గతేడాది నుంచి అమ్మ ఒడి పేరిట జమ చేసే రూ.15 వేల నుంచి పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ కోసం రూ.2 వేలు మనిహాయించిన విషయం తెలిసిందే. రూ.13 వేలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అమ్మఒడి పథకానికి అర్హులు కావాలంటే విద్యార్థులకు కచ్చితంగా 75 శాతానికి మించి హాజరు కచ్చితంగా ఉండాలి.