ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవితకు రిమాండ్!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  కల్వకుంట కవితను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఆమెను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  కల్వకుంట కవితను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఆమెను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కల్వకుంట కవితను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీలో ఎంఎల్సీ కవిత కీలక పాత్ర పోషించిందని, ఆమెకు 100 కోట్లు ముడుపులు అందాయని ఆరోపణలు వచ్చాయి. గతంలో ఈడీ కవితకు నోటీసులు ఇచ్చారు. నిన్నఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవితకు ఈడీ షాక్ ఇచ్చింది. కవితకు ఈడీ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీ  తీసుకెళ్లారు. ఈ రోజు కోర్టులో హాజరుపర్చగా అక్కడ  కవితకు చుక్కెదురైంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  అధికారులు ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాకిచ్చింది. శుక్రవారం కవిత ఇంట్లో తనిఖీలు చేపట్టిన ఈడీ అధికారులు కవితకు అరెస్టు వారెంట్ ఇచ్చారు. అనంతరం ఆమెను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కవితను అరెస్టు చేసిన అధికారులు ఢిల్లీకి తీసుకెళ్లారు. ఈ రోజు ఉదయం రౌస్ అవెన్యూ కోర్టు ముందు కవితను హాజరు పర్చారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు కోర్టులో చుక్కెదురైంది. రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు ఏడు రోజుల రిమాండ్ విధించింది. మార్చి 23 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.

ఈ కేసు అంశంలో ఇరువైపుల వాదనలు జరిగాయి. కవిత అరెస్టు అక్రమమని ఆమె తరఫు లాయర్లు చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. అయితే ఇదే సమయంలో కవితకు హైబీపీ ఉందని ఆమె తరపు లాయర్ తెలిపారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో రక్తపోటు లేదని కోర్టుకు తెలిపారు. ఆమె అరెస్టు విషయంలో నిబంధనలు పాటించలేదని, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయితే ఈ కారణంగా ఆమెకు రిలీఫ్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో రిమాండ్‌ విధిస్తూ.. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని  కోర్టు ఆదేశించింది. అలాగే రిమాండ్‌లో కుటుంబ సభ్యులు, లాయర్లు కలిసేందుకు కవితకు అవకాశం కల్పిస్తూనే, ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది. 7 రోజుల ఈడీ కస్టడీలో అవసరమైన మెడిసిన్, దుస్తులు, పుడ్ అందించవచ్చని లాయర్ కు తెలిపారు.

కవిత కస్టడీ రిపోర్టులో ఈడీ కీలక అంశాలను పొందుపర్చింది. ఆ కస్టడీ రిపోర్టులో.. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవిత కీలకంగా ఉన్నారు. సౌత్‌ లాబీ పేరుతో లిక్కర్‌ స్కాంలో ఆమె కీలకంగా వ్యవహరించాని పేర్కొన్నారు. ఆప్‌ పార్టీకి వంద కోట్లు ఇవ్వడంలో కవిత కీలకపాత్ర ధారని కస్టడీ రిపోర్ట్ లో ఉంది. కవితకు బినామీగా రామచంద్ర పిళ్లై ఉన్నారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. పిళ్లై ద్వారా కవిత మొత్తం వ్యవహారం నడిపించారని ఎంపీ మాగుంట ద్వారా రూ. 30 కోట్లను కవిత ఢిల్లీకి చేర్చారని ఈడీ తెలిపింది. రూ. 30 కోట్లను అభిషేక్‌ బోయినపల్లి ఢిల్లీకి తీసుకెళ్లాడు అని ఈడీ పేర్కొంది.

 

Show comments