iDreamPost
android-app
ios-app

Revanth Reddy: రేపే ప్రమాణ స్వీకారం! రేవంత్ రెడ్డి CM కాబోతున్నారా?

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎవరు సీఎం కాబోతున్నారు? అనే ప్రశ్న వినిపిస్తోంది.

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎవరు సీఎం కాబోతున్నారు? అనే ప్రశ్న వినిపిస్తోంది.

Revanth Reddy: రేపే ప్రమాణ స్వీకారం! రేవంత్ రెడ్డి CM కాబోతున్నారా?

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ని కూడా కాంగ్రెస్ పార్టీ దాటేసింది. ఏకపక్షంగా ఆధిపత్యాన్ని కొనసాగించడమే కాకుండా.. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేయబోతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి సీఎం ఎవరు అవుతారు? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఆ ప్రశ్నకు సమాధానంగా అందరూ రేవంత్ రెడ్డి పేరునే చెబుతున్నారు. ఆయనే ముఖ్యమంత్రి కాబోతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే తెలంగాణ డీజీబీ, ముఖ్యమైన పోలీసు అధికారులు రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. భద్రత, బందోబస్తు, ప్రమాణస్వీకారానికి సంబంధించి రేవంత్ రెడ్డి పోలీసులకు స్పష్టమైన సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు అందరూ ఇవాళే హైదరాబాద్ కు చేరుకోవాలంటూ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే సోమవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైని కలవబోతున్నారు. వారి మెజారిటీని గవర్నర్ వద్ద నిరుపించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని తెలిజేయబోతున్నారు. అంతేకాకుండా ఆదివారం రాత్రే సీఎల్పీ సమావేశం జరగనుందని తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణకు చేరుకుంటున్నారు. సీఎం ఎంపిక విషయంలో ఏఐసీసీ నేతలు ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది.

ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ విషయంపై రేవంత్ రెడ్డి డీజీపీతో చర్చించినట్లు సమాచారం. ప్రమాణస్వీకారానికి ప్రముఖులు, ముఖ్యనేతలు హాజరు కాబోతున్న విషయాన్ని డీజీపీకి తెలియజేశారు. భద్రత, బందోబస్తు విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే గెలుపొందిన ఎమ్మెల్యేలకు పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. 2+2 గన్ మెన్లతో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. డీజీపీ అంజనీకుమార్ విషయంలో ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకుంది. ఆదివారం ఉదయం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడంపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించారంటూ డీజీపీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది. మహేష్ భగవత్, సందీప్ శాండిల్యకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరి.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.